Site icon HashtagU Telugu

Mohammed Shami: షమీని అల్లా శిక్షిస్తాడు.. ఉపవాసాన్ని పాటించకపోవడం నేరమే : మతపెద్ద

Mohammed Shami Ramzan Fasting Semifinal India Vs Australia Dubai

Mohammed Shami: ‘‘ముస్లిం సమాజం రంజాన్ ఉపవాసం పాటిస్తున్న సమయం ఇది.  ఈ టైంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌ వేదికగా మహ్మద్ షమీ బహిరంగంగా ఎనర్జీ డ్రింక్ తాగడం సరికాదు. ఇందుకోసం షమీని అల్లా తప్పకుండా శిక్షిస్తాడు. రంజాన్ మాసంలో ముస్లింల తప్పనిసరి విధుల్లో ఒకటి  ‘రోజా’ (ఉపవాసం).  ఆరోగ్యంగా ఉన్న ప్రతి ముస్లిం పురుషుడు, స్త్రీ తప్పకుండా ఉపవాసం పాటించాలి. అలా పాటించని వారు షరియత్  ప్రకారం పెద్ద నేరస్తులు’’ అని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ  ఫైర్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మౌలానా వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు తప్పుపడుతున్నారు. వారంతా షమీకి మద్దతుగా నిలుస్తున్నారు.

Also Read :Hair Stolen: తెలుగులో మాట్లాడుతూ చోరీ.. రూ.1 కోటి జుట్టు మాయం

నెటిజన్లు పెద్దసంఖ్యలోనే

అయితే షమీని వ్యతిరేకించే నెటిజన్లు కూడా పెద్దసంఖ్యలోనే ఉన్నారు. ‘‘మతాన్ని క్రీడలతో కలపకూడదు. షమీ విజయాల పట్ల ముస్లిం సమాజం కూడా గర్విస్తుంది’’ అని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బుమ్రా లేకపోవడంతో ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు కీలక ఫాస్ట్ బౌలర్‌గా షమీ వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 48 పరుగులిచ్చి మూడు వికెట్లను ఆయన పడగొట్టాడు. ఈ మ్యాచ్‌ జరుగుతుండగా షమీ జ్యూస్ తాగుతూ కనిపించారు. ఓ వైపు రంజాన్ ఉపవాసాలు జరుగుతున్న వేళ.. మరోవైపు షమీ(Mohammed Shami) ఈవిధంగా బహిరంగంగా జ్యూస్ తాగడాన్ని మౌలానా షాబుద్దీన్ రజ్వీ  తప్పుపట్టారు. ఉపవాసాన్ని వదిలేసి షమీ పాపం చేశాడని ఆయన తెలిపారు. ఇస్లాం బాధ్యతలను ఖచ్చితంగా పాటించాలని షమీకి మౌలానా సూచన చేశారు.

షమీ మాజీ భార్య ఉపవాసాలు

షమీ మాజీ భార్య హసీన్ జహాన్ తన కుమార్తెతో కలిసి రంజాన్‌ ఉపవాస దీక్షలు పాటిస్తోంది. షమీతో వివాదం కారణంగా హసీన్ జహాన్ విడాకులు తీసుకున్నారు. ఇప్పుడామె తన కూతురితో జీవిస్తున్నారు. 2014 సంవత్సరంలో షమీ, హసీన్ పెళ్లి చేసుకున్నారు. 2015 జూలై 17న వీరికి కుమార్తె పుట్టింది. 2018 సంవత్సరంలో షమీకి మరో మహిళతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో హసీన్ జహాన్  బహిరంగంగా తీవ్ర విమర్శలు చేసింది. అనంతరం వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.