Mohammed Shami: మహ్మద్ షమీకి బిగ్ రిలీఫ్

మరికొద్ది రోజుల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అంతకన్న ముందు ఈ నెల 22 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది.

Mohammed Shami: మరికొద్ది రోజుల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అంతకన్న ముందు ఈ నెల 22 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. వన్డే ప్రపంచకప్‌కు ముందు ఈ సిరీస్ టీమిండియాకు ప్రదర్శన పరంగా ఎంతగానో ఉపయోగపడనుంది. ఇక పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై జరగనున్న వన్డే ప్రపంచకప్‌ కోసం టీమ్‌ఇండియా రెడీ అవుతున్న సమయంలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి బిగ్ రిలీజ్‌ లభించింది.

షమీ భార్య హసిన్ జహాన్ దాఖలు చేసిన గృహ హింస కేసులో అలీపూర్‌లోని ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షమీ భార్య హసీన్ జహాన్ 2018లో షమీ మరియు కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. తనను వేధిస్తున్నారంటూ ఆరోపించింది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2019 ఆగస్టు 29న అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. ఈ వారెంట్ పై అదే సంవత్సరం సెప్టెంబర్ 9న కోల్ కత్తా స్థానిక కోర్టు స్టే విధించింది. కాగా ఈ కేసులో షమీ తొలిసారి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యాడు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరాడు. షమీ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన జడ్జి 2 వేల పూచికత్తుపై బెయిల్ ఇచ్చారు.

ప్రపంచకప్‌కు ముందు షమీకి బెయిల్ లభించడంతో ఆటపై మరింత దృష్టిపెట్టేందుకు అవకాశముంది. కాగా గత ఆసియా కప్ లో షమీకి జట్టులో స్థానం సంపాదించినప్పటికీ ఆడే అవకాశం రాలేదు. బుమ్రా కి రెస్ట్ ఇచ్చిన సమయంలో షమీ మైదానంలోకి అడుగుపెట్టాడు. అయితే ప్రపంచ కప్ లో మాత్రం షమీ సేవలను టీమిండియా ఫుల్ ఫిల్డ్జ్ గా ఉపయోగించుకోవాలనుకుంటుంది. మరి షమీ రాణిస్తాడా లేదా చూడాలి.

Also Read: AP Officers In Dilemma : నాడు వైఎస్ నేడు జ‌గ‌న్ ! బ్యూరోక్రాట్స్ లో ద‌డ‌!!