Site icon HashtagU Telugu

Team India Cricketer: టీమిండియా స్టార్ పేసర్ కి షాకిచ్చిన కోర్టు

Mohammed Shami

Mohammed Shami

టీమిండియా ఆటగాడు మహమ్మద్ షమీ (Mohammed Shami)కి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన మాజీ భార్య హసిన్ జహన్‌కు నెలవారీ భరణం తప్పకుండా చెల్లించాలని కోల్‌కతా కోర్టు ఆదేశించింది. షమీ తనను వేధిస్తున్నాడని గతంలో హసిన్ కేసు పెట్టింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆమెకు ప్రతినెలా రూ. 50 వేలు భరణం చెల్లించాలని షమీని ఆదేశించింది. అలీపూర్ కోర్టు న్యాయమూర్తి అనిందితా గంగూలీ ఈ అంశంపై తీర్పును ప్రకటించారు. షమీ విడిపోయిన తన భార్య హసిన్ జహాన్‌కు నెలవారీ రూ.1.30 లక్షల భరణం చెల్లించాలని కోల్‌కతా కోర్టు సోమవారం ఆదేశించింది. రూ.1.30 లక్షలలో రూ.50,000 హసిన్ జహాన్‌కు వ్యక్తిగత భరణం, మిగిలిన రూ.80,000 ఆమెతో ఉంటున్న వారి కుమార్తె పోషణ ఖర్చుకు ఇవ్వాలని పేర్కొంది.

అయితే ఈ మొత్తంపై హాసిన్ జహాన్ సంతృప్తి చెందలేదు. ఎందుకంటే నెలకు రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. 2018 సంవత్సరంలో హసిన్ జహాన్ నెలవారీ భరణం రూ. 10 లక్షలు డిమాండ్ చేస్తూ లీగల్ పిటిషన్‌ను దాఖలు చేసింది. వ్యక్తిగత ఖర్చుల కోసం రూ.7 లక్షలు, తన కూతురి పోషణకు నెలకు రూ.3 లక్షల భరణం ఇవ్వాలని హసిన్ జహాన్ పిటిషన్‌లో పేర్కొంది. ఈ తీర్పుపై హసిన్ జహాన్ ఇప్పుడు హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు.

Also Read: IND vs NZ ODI: క్లీన్​స్వీప్​కు వేళాయే.. ఇండోర్ వేదికగా నేడు మూడో వన్డే

2018లో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ వ్యక్తిగత జీవితంలో కుదుపు వచ్చింది. షమీ భార్య హసీన్ జహాన్ షమీపై గృహ హింస, మ్యాచ్ ఫిక్సింగ్, వరకట్న వేధింపుల వంటి తీవ్రమైన ఆరోపణలు చేసింది. దీంతో మహ్మద్ షమీ తన భార్య ఆరోపణలపై క్లారిటీ ఇచ్చాడు. తర్వాత షమీ, హసిన్ జహాన్ విడిపోయారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత పేసర్ ఆదాయపు పన్ను రిటర్న్ ప్రకారం ఆ ఆర్థిక సంవత్సరంలో అతని వార్షిక ఆదాయం రూ. 7 కోట్ల కంటే ఎక్కువగా ఉందని, దాని ఆధారంగా నెలవారీ ఆదాయాన్ని కోరినట్లు అతని న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. రూ.10 లక్షల భరణం సబబు కాదన్నారు. అయితే, షమీ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. హసిన్ జహాన్ స్వయంగా వృత్తిరీత్యా ఫ్యాషన్ మోడల్‌గా పని చేయడం ద్వారా స్థిరమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నందున అధిక భరణం డిమాండ్ సమర్థించబడదని పేర్కొన్నారు.