Mohammad Hafeez: పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో కలకలం.. వరల్డ్ కప్ కు ముందు పీసీబీకి మహ్మద్ హఫీజ్ రాజీనామా..!

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు టెక్నికల్ కమిటీకి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ (Mohammad Hafeez) రాజీనామా చేశాడు.

  • Written By:
  • Publish Date - September 22, 2023 / 02:46 PM IST

Mohammad Hafeez: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు టెక్నికల్ కమిటీకి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ (Mohammad Hafeez) రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని హఫీజ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. ఇటీవల, ఆసియా కప్ 2023 ప్రదర్శనపై సమీక్ష సమావేశం జరిగింది. ఒక నివేదిక ప్రకారం.. జట్టు ప్రదర్శనపై PCB చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ అసంతృప్తిగా ఉన్నారు. దింతో 2023 ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్‌లో పెద్ద దుమారమే రేగే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

హఫీజ్ తన రాజీనామా గురించి ట్విట్టర్ లో పోస్ట్ ద్వారా అభిమానులకు తెలియజేశాడు. పాకిస్థాన్ టెక్నికల్ కమిటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను అని రాశారు. నేను గౌరవ సభ్యుడిని. నేను జాకా అష్రఫ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆయన వల్లే ఈ అవకాశం వచ్చింది. జకా అష్రాఫ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు నా సలహాలు అవసరమైనప్పుడు, నేను అందుబాటులో ఉంటాను. పాకిస్థాన్ క్రికెట్‌కు నా శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చాడు.

Also Read: Kohli- Rohit: విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలకు అందుకే విశ్రాంతి.. కోచ్ రాహుల్ ద్రవిడ్ క్లారిటీ..!

2023 ఆసియా కప్‌లో పాకిస్థాన్ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. సూపర్ ఫోర్ మ్యాచ్‌ల తర్వాత ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాక్ జట్టు ఫైనల్స్‌కు చేరుకోలేకపోయింది. ఓ నివేదిక ప్రకారం.. పీసీబీ దీనికి సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో మహ్మద్ హఫీజ్‌తో పాటు పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్, కెప్టెన్ బాబర్ ఆజం, వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్, మిస్బా ఉల్ హక్ పాల్గొన్నారు. దింతో 2023 ప్రపంచకప్‌కు ముందు పీసీబీలో కలకలం రేగింది. హఫీజ్ రాజీనామా బోర్డులో అంతా సవ్యంగా సాగడం లేదనడానికి నిదర్శనం. ఇకపోతే అక్టోబర్ 5 నుంచి భారత్ లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య అక్టోబర్ 14న మ్యాచ్ జరగనుంది.