Site icon HashtagU Telugu

KL Rahul: కేఎల్ రాహుల్‌పై ఇంగ్లాండ్ మాజీ క్రికెట‌ర్ ప్ర‌శంస‌లు!

Fitness Test

Fitness Test

KL Rahul: ప్ర‌స్తుతం భారతదేశంలో క్రికెట్ గురించి చర్చ వచ్చినప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, లేదా శుభ్‌మన్ గిల్ వంటి పేర్లు ముందుగా వస్తాయి. అయితే ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ (KL Rahul) ఇటీవల ఒక భిన్నమైన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇంగ్లాండ్‌తో ఇటీవల ముగిసిన సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన కేఎల్ రాహుల్‌ను ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరిగా మొయిన్ అలీ పేర్కొన్నారు. వికెట్ పోడ్‌కాస్ట్‌లో మొయిన్ అలీ మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌తో తనను ఎంతగానో ఆకట్టుకున్నాడని, అతని ఆట తీరు ప్రపంచంలోని ఏ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌కు తీసిపోదని ప్రశంసించారు.

ఇంగ్లాండ్‌పై రాహుల్ అద్భుతమైన ప్రదర్శన

ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు రిటైర్ అయిన తర్వాత జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాల్సిన బాధ్యత రాహుల్‌పై పడింది. అతను ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి, సిరీస్‌లో 532 పరుగులు సాధించాడు. 53.20 సగటుతో పరుగులు సాధించాడు. 2 అద్భుతమైన శతకాలు, 2 అర్ధశతకాలు నమోదు చేశాడు. ఈ ప్రదర్శనతో కేఎల్ రాహుల్ తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వడానికి నిరంతరం కృషి చేస్తూ, చాలా సందర్భాలలో విజయం సాధించాడు.

Also Read: Fire Accident : కేసముద్రం రైల్వే స్టేషన్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. రెస్ట్ కోచ్‌ దగ్ధం

రాహుల్ భవిష్యత్తు ప్రణాళికలు

ఇటీవలి టెస్ట్ సిరీస్ తర్వాత టీమ్ ఇండియాకు కొద్దికాలం పాటు టెస్ట్ మ్యాచ్‌లు లేవు. రాబోయే వెస్టిండీస్‌తో జరిగే 2 మ్యాచ్‌ల సిరీస్‌లో రాహుల్ మళ్లీ తెల్ల జెర్సీలో కనిపించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్‌లో చూపిన అద్భుతమైన ఫామ్‌ను అతను వెస్టిండీస్‌లో కూడా కొనసాగిస్తే, అది భారత జట్టుకు చాలా ఉపయోగపడుతుంది. రాహుల్ వంటి ప్రతిభావంతుడైన ఆటగాడి నుంచి అభిమానులు మరిన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లను ఆశిస్తున్నారు.