Site icon HashtagU Telugu

BCCI: బీసీసీఐలో కీలక మార్పులు.. కొత్త అధ్య‌క్షుడు, సెలెక్ట‌ర్లు వీరే!

BCCI

BCCI

BCCI: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI)కి ఇటీవల మిథున్ మన్హాస్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో పాటు భారత జట్టు సెలెక్షన్ కమిటీలో కూడా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. భారత పురుషుల జట్టు సెలెక్షన్ కమిటీలో మాజీ క్రికెటర్లు ప్రజ్ఞాన్ ఓఝా, ఆర్‌పీ సింగ్ సభ్యులుగా చేరారు. వీరిద్దరూ ఇప్పుడు ఛైర్మన్ అజిత్ అగార్కర్‌తో కలిసి టీమ్ ఇండియాను ఎంపిక చేయడంలో పాలుపంచుకుంటారు.

మహిళా సెలెక్షన్ కమిటీలో మార్పులు

మహిళా క్రికెట్ సెలెక్షన్ కమిటీకి ఢిల్లీకి చెందిన అమిత శర్మను కొత్త ఛైర్‌పర్సన్‌గా ఎంపిక చేశారు. ఈ కమిటీలో సులక్షణ నాయక్, శ్రవంతి నాయుడు, శ్యామా డే, జయ శర్మ కూడా సభ్యులుగా ఉన్నారు. జూనియర్ సెలెక్షన్ ప్యానెల్ ఛైర్మన్‌గా ఎస్. శరత్ నియమితులయ్యారు.

Also Read: Election Commission: బీహార్ ఎన్నికలకు 470 మంది కేంద్ర పరిశీలకులను నియమించిన ఈసీ!

BCCI సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయం

సెలెక్షన్ కమిటీల నియామకంతో పాటు, BCCI AGM (సర్వసభ్య సమావేశం)లో మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. 16 ఏళ్లలోపు ఉన్న ఏ ఆటగాడు కూడా ఐపీఎల్ (IPL) ఆడకూడదు అని నిర్ణయించారు. వారు తమ రాష్ట్రం తరపున రంజీ ట్రోఫీలో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడిన తర్వాతే ఐపీఎల్‌కు అర్హులు అవుతారు. ఈ నిర్ణయం యువ ఆటగాళ్లు కేవలం టీ20 క్రికెట్‌కే పరిమితం కాకుండా రంజీ ట్రోఫీ వంటి కీలకమైన టోర్నమెంట్లలో పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది. తద్వారా వారి క్రికెట్ నైపుణ్యాలు మెరుగుపడతాయి.

మిథున్ మన్హాస్ కొత్త BCCI అధ్యక్షుడు

సమావేశంలో BCCI కొత్త అధ్యక్షుడి ఎన్నిక కూడా జరిగింది. దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన మిథున్ మన్హాస్‌కు ఈ కీలక బాధ్యత అప్పగించారు. ఆయన రాబోయే మూడు సంవత్సరాల పాటు BCCI అధ్యక్షుడిగా కొనసాగుతారు. దీంతో పాటు దేవజిత్ సైకియా కార్యదర్శిగా, రాజీవ్ శుక్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతారు.

Exit mobile version