Mitchell Starc: ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా స్టార్క్

యాషెస్ 2023 రెండో టెస్టు మ్యాచ్ లండన్‌లోని లార్డ్స్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఇప్పటివరకు చాలా మంచి ఫామ్‌లో కనిపించాడు.

  • Written By:
  • Updated On - July 2, 2023 / 10:57 AM IST

Mitchell Starc: యాషెస్ 2023 రెండో టెస్టు మ్యాచ్ లండన్‌లోని లార్డ్స్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఇప్పటివరకు చాలా మంచి ఫామ్‌లో కనిపించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు రోజులు పూర్తి కాగా ఇప్పటి వరకు స్టార్క్ 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ఐదు వికెట్లతో ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు.

ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్‌ను స్టార్క్ వెనక్కి నెట్టాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో జాన్సన్ 313 వికెట్లు తీశాడు. అదే సమయంలో స్టార్క్ ఇప్పుడు టెస్టుల్లో 315 వికెట్లు పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లలో స్టార్క్ ఒకడు. ఈ టాప్-5 జాబితాలో ఆస్ట్రేలియా మాజీ వెటరన్‌లు షేన్ వార్నర్, గ్లెన్ మెక్‌గ్రాత్ కూడా ఉన్నారు.

అదే సమయంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ కూడా జాబితాలో ఉన్నాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా లియాన్ నిలిచాడు. ఇప్పటి వరకు 496 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో షేన్ వార్న్ 708 వికెట్లతో మొదటి స్థానంలో, గ్లెన్ మెక్‌గ్రాత్ 563 వికెట్లతో రెండో స్థానంలో, లియాన్ మూడో స్థానంలో, డీకే లిల్లీ 355 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.

Also Read: Sunil Gavaskar: వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్.. సునీల్ గవాస్కర్ ఏం చెప్పారంటే..?

మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ కెరీర్

స్టార్క్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు 78 టెస్టులు, 110 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 27.61 సగటుతో 315 వికెట్లు, వన్డేల్లో 22.1 సగటుతో 219 వికెట్లు, టీ20 ఇంటర్నేషనల్స్‌లో 22.92 సగటుతో 73 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20లో అతని ఎకానమీ 7.64గా ఉంది. స్టార్క్ 2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

ఆస్ట్రేలియా తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్లు

– షేన్ వార్న్ – 708 వికెట్లు
– గ్లెన్ మెక్‌గ్రాత్ – 563 వికెట్లు
– నాథన్ లియాన్ – 496 వికెట్లు
– డికె లిల్లీ – 355 వికెట్లు
– మిచెల్ స్టార్క్ – 315 వికెట్లు