Site icon HashtagU Telugu

MCA Pitch Report: స్పిన్నర్లకే అనుకూలం.. పుణే పిచ్ రిపోర్ట్ ఇదే

India vs England 5th T20I

India vs England 5th T20I

MCA Pitch Report: భారత్, ఇంగ్లాండ్ టీ ట్వంటీ సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచిన భారత్ కు మూడో టీ ట్వంటీలో షాక్ తగిలింది. సమిష్టిగా రాణించిన ఇంగ్లీష్ టీమ్ రాజ్ కోట్ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ఆశలు నిలుపుకుంది. బౌలింగ్ లో అదరగొట్టిన భారత జట్టు బ్యాటింగ్ లో మాత్రం చేతులెత్తేసింది. దీంతో హ్యాట్రిక్ విజయంతో సిరీస్ గెలవాలన్న ఆశలు నెరవేరలేదు. ఇప్పుడు నాలుగో టీ ట్వంటీలో గెలిచి మరో మ్యాచ్ మిగిలిండగానే సిరీస్ గెలవాలని భారత్ భావిస్తోంది. నాలుగో టీ ట్వంటీ శుక్రవారం పుణే వేదికగా జరగబోతోంది. ఇక నాలుగో టీ ట్వంటీకి ఆతిథ్యమిస్తున్న పిచ్ పై (MCA Pitch Report) సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పిచ్ స్పిన్నర్లకు సహరిస్తుందని అంచనా వేస్తున్నారు. సహజంగానే పుణే ఎంసీఎ పిచ్ స్లో బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్ లోనూ స్పిన్నర్లే కీలకం కానున్నారు. ఈ సిరీస్ ఆరంభం నుంచీ స్పిన్నర్లదే పైచేయిగా ఉంటోంది.

మొదటి టీ ట్వంటీలో ముగ్గురు స్పిన్నర్లతో ఆడిన టీమిండియా తర్వాతి రెండు మ్యాచ్ లలోనూ నలుగురు స్పిన్నర్లను దింపింది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి సూపర్ ఫామ్ తో అదరగొడుతున్నాడు. మూడు మ్యాచ్ లలో 10 వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్ తప్పిస్తే మిగిలిన అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కూడా రాణిస్తున్నారు. పుణే పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందన్న అంచనాల నేపథ్యంలో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతుందా లేక నలుగురితోనే కంటిన్యూ చేస్తుందా అనేది చూడాలి. ఈ పిచ్ పై 180 ప్లస్ స్కోర్ ఖచ్చితంగా కాంపిటేటివ్ టోటల్ గా చెబుతున్నారు. అయితే టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకుని ప్రత్యర్థిని కట్టడి చేయడం ద్వారా ఛేజింగ్ చేసేందుకు వీలుంటుందని అంచనా. గత మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేసే అవకాశం వచ్చినా భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. 127 పరుగులకే 8 వికెట్లు కోల్పోయినప్పటకీ లివింగ్ స్టోన్ విధ్వంసంతో ఇంగ్లాండ్ 171 పరుగులు చేయగలిగింది. ఇలాంటి తప్పిదాన్ని భారత బౌలర్లు రిపీట్ చేయకుండా ఉంటే మాత్రం పుణేలోనే సిరీస్ విజయాన్ని అందుకోవచ్చు. కాగా పుణే పిచ్ పై 4 టీ ట్వంటీలు జరగ్గా మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు 2 సార్లు , ఛేజింగ్ టీమ్ 2 సార్లు విజయం సాధించాయి. ఇక్కడ యావరేజ్ స్కోర్ 166 పరుగులుగా ఉంది. ఇక్కడ భారత జట్టు గతంలో ఇంగ్లాండ్ పై 158 పరుగుల టార్గెట్ ను ఛేదించింది. మొత్తం మీద నాలుగో టీ ట్వంటీలోనూ స్పిన్నర్లే మ్యాచ్ విన్నర్లు కాబోతున్నారు.

Also Read: Sanjay Bangar: టీమిండియా భవిష్యత్తు వాళ్లిద్దరే!

పుణే ఎంసిఎ స్టేడియం టీ20 రికార్డ్