Site icon HashtagU Telugu

Maxwell Hospitalised : ఫుల్లుగా మందుకొట్టి హాస్పిటల్ పాలు… మాక్స్ వెల్ పై ఆసీస్ బోర్డు సీరియస్

Glenn Maxwell

Glenn Maxwell

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell ) వివాదంలో చిక్కుకున్నాడు. ఓ పార్టీకి వెళ్లి తప్పతాగి (Alcohol-Related Incident) పడిపోయాడు. అడిలైడ్‌లో సిక్స్ అండ్ అవుట్ బ్యాండ్‌తో కలిసి మాక్స్‌వెల్ పార్టీ చేసుకున్నాడు. ఫుల్‌గా మందు కొట్టాడు. ఆ బ్యాండ్‌లో ఆస్ట్రేలియా మాజీ పేస‌ర్ బ్రెట్ లీ కూడా మెంబర్ గా ఉన్నాడు. అనంతరం అంబులెన్స్‌లో అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (Australia Cricket Board) సీరియస్ అయ్యింది. అసలేం జరిగిందనే దానిపై దర్యాప్తుకు ఆదేశాలు జారీచేసింది. ఇదిలా ఉంటే అదే రోజు రాత్రి వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ప్రకటించిన జట్టులో మాక్స్‌వెల్‌ కు చోటు దక్కలేదు. తాగి పడిపోయిన ఘటనతోనే అతన్ని పక్కనపెట్టినట్టు భావిస్తున్నారు. టీ ట్వంటీ సిరీస్ కోసం మాక్సీకి వన్డే టీమ్ నుంచి విశ్రాంతి ఇస్తున్నట్లు బోర్డు చెబుతున్నా…క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతడిపై వేటు పడినట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

అడిలైడ్‌లో మాక్స్‌వెల్‌కు సంబంధించిన సంఘటన బోర్డు దృష్టిలోకి వచ్చిందిని, దానిపై పూర్తి సమాచారం తెలుసుకుంటున్నట్టు సీఎ తెలిపింది. ఈ కారణంగా మ్యాక్సీని తప్పించలేదని, బిగ్ బాష్ లీగ్‌తో పాటు అతడు పని ఒత్తిడి గురించి ఆలోచిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు మాక్స్‌వెల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు, అయితే స్టార్స్ జట్టు సెమీఫైనల్స్ కు చేరలేకపోయింది.

Read Also : Kangana Ranaut: కంగనా రనౌత్ ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్