Site icon HashtagU Telugu

CSK: ఐపీఎల్ 2024కు ముందు సీఎస్కే జ‌ట్టుకు బిగ్ షాక్ త‌గ‌ల‌నుందా..?

CSK vs RR

CSK vs RR

CSK: IPL 2023లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి ఐపీఎల్ 2024లో ధోనీ సారథ్యంలో చెన్నై డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. అయితే ఈ సీజన్ ప్రారంభం కాకముందే CSKకి పెద్ద ఎదురుదెబ్బ త‌గిలే అవకాశ‌ముంది. వాస్తవానికి మహేంద్ర సింగ్ ధోనీ ‘ట్రంప్ ఏస్’ అని పిలువబడే జట్టులోని ఆ బౌలర్ టోర్నమెంట్‌కు ముందు గాయపడ్డాడు.

చెన్నై తరఫున ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతిషా పతిరాన గాయపడ్డాడు. ప్ర‌స్తుతం శ్రీలంక జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో మూడు ఫార్మాట్ల సిరీస్ శ్రీలంక- బంగ్లాదేశ్ మధ్య T20 ఇంటర్నేషనల్‌తో ప్రారంభమవుతుంది. టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు జరగ్గా, మూడో మ్యాచ్ మార్చి 09న జరగనుంది.

అయితే మూడో మ్యాచ్‌కు ముందు స్నాయువు గాయం కారణంగా జట్టుకు దూరమైన ఫాస్ట్ బౌలర్ మతిషా పతిరానా రూపంలో శ్రీలంకకు పెద్ద దెబ్బ తగిలింది. పతిరానా గురించి శ్రీలంక క్రికెట్ బోర్డు మాట్లాడుతూ.. అతను ఎడమ కాలులో గ్రేడ్-1 స్నాయువు గాయంతో బాధపడుతున్నందున అతను మూడవ T20లో ఎంపికకు అందుబాటులో ఉండడు అని పేర్కొంది. రెండో టీ20లో బౌలింగ్‌ చేస్తుండగా ప‌తిరానా గాయపడ్డాడు.

Also Read: Female Doctor: విషాదం.. ఆస్ట్రేలియాలో తెలుగు డాక్టర్ మృతి

అయితే మూడో టీ20కి ప‌తిరానా తప్పుకున్నారనేది మాత్రమే ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రస్తుతం అతను ఎంతకాలం గ్రౌండ్‌కు బయట ఉంటాడు లేదా ఎప్పుడు ఫీల్డ్‌లోకి వస్తాడనే దానిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇలాంటి పరిస్థితిలో ప‌తిరానా గాయం చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆందోళన కలిగించే విషయం కావచ్చు. అతను చెన్నైకి ఆడగలడా లేదా అన్నది ఇప్పుడు సందేహంగా మారింది.

ఐపీఎల్ 2023లో చెన్నై త‌ర‌పున అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌

ఐపిఎల్ 2023లో సిఎస్‌కె త‌ర‌పున ప‌తిరణ చాలా అద్భుతంగా రాణించాడు. పతిరణ 12 మ్యాచ్‌ల్లో 19.53 సగటుతో 19 వికెట్లు తీశాడు. ఈ కాలంలో అతను 8.01 ఎకానమీ వద్ద పరుగులు ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌కు ముందు ప‌తిరణ కోలుకోలేకపోతే అది చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి దెబ్బే అవుతుంది.

We’re now on WhatsApp : Click to Join