Mallika Sagar Blunder: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం నవంబర్ 25న సౌదీ అరేబియాలోని జెడ్డాలో ముగిసింది. ఈ మెగా వేలంలో 10 జట్లు మొత్తం 182 మంది ఆటగాళ్లను రూ.639.15 కోట్లకు కొనుగోలు చేశాయి. అయితే ఈసారి వేలం పాటలో మల్లికా సాగర్ పెద్ద తప్పు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మధ్య ఓపెనర్ స్వస్తిక్ చికారా వేలం పోరు జరుగుతున్నప్పుడు ఈ లోపం చోటుచేసుకుంది. మల్లిక (Mallika Sagar Blunder) ఢిల్లీ మేనేజ్‌మెంట్ బిడ్‌ను పట్టించుకోకుండా చికారాను RCB జట్టులో చేరినట్లు పేర్కొంది.
ఢిల్లీకి నష్టం.. ఆర్‌సీబీకి లాభం
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ హేమంగ్ బదానీ స్వస్తిక్ చికారా కోసం వేలం వేయడానికి బిడ్‌ను పెంచినట్లు వెల్లడించాడు. అయితే మల్లికా దానిని గమనించలేదు. తన తప్పును తెలుసుకున్న మల్లిక తన తప్పును అంగీకరించింది. కానీ అప్పటికే నిర్ణయం వెలువడింది. ఆర్సీబీ 19 ఏళ్ల అన్‌క్యాప్‌డ్ బ్యాట్స్‌మెన్ స్వస్తిక్ చికారాను అతని ప్రాథమిక ధర రూ. 30 లక్షలకు తమ జట్టులో చేర్చుకుంది. దీంతో ఢిల్లీ భారీ నష్టాన్ని చవిచూడగా.. విరాట్ కోహ్లి సారథ్యంలోని ఆర్‌సీబీకి ఇది లాభంగా మారింది.
Also Read: Protein : మీ తల్లిదండ్రులకు ఈ లక్షణాలన్నీ కనిపిస్తే, వారి శరీరంలో ప్రోటీన్ లోపం ఉందని అర్థం
స్వస్తిక్ చికారా ఎవరు?
స్వస్తిక్ చికారా ప్రతిభావంతుడైన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్. అతను 2024లో జరిగిన UP-T20 లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. ఆ టోర్నమెంట్‌లో, అతను 12 ఇన్నింగ్స్‌లలో 49.9 సగటుతో 499 పరుగుల అత్యధిక స్కోర్ చేశాడు. అతని ప్రతిభ చూసి చాలా టీమ్‌లు అతడిని తమ టీమ్‌లో చేర్చుకోవాలనుకున్నాయి. అయితే మెగా వేలంలో పొరపాటు జరగడంతో నేరుగా ఆర్సీబీలో భాగమయ్యాడు. ఐపీఎల్ 2025లో స్వస్తిక్ చికారా తన బ్యాటింగ్‌తో తన జట్టుకు ఎంత ప్రయోజనం చేకూరుస్తాడో చూడాలి.