Site icon HashtagU Telugu

Venues: వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లు జరిగేది ఈ నగరాల్లోనే.. 12 మైదానాల్లో వరల్డ్ కప్ పోరు..?

World Cup Venues

Resizeimagesize (1280 X 720) 11zon

Venues: వన్డే ప్రపంచకప్ 2023 భారత గడ్డపై నిర్వహించనున్నారు. అయితే ఈ ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌పై ఓ వార్త బయటకి వచ్చింది. ప్రపంచకప్ వేదికల (Venues)పై ఒక క్లారిటీ వచ్చినట్లు సమాచారం. ODI ప్రపంచ కప్ 2023 భారతదేశంలో 12 మైదానాల్లో జరగనున్నట్లు సమాచారం అందుతుంది. కాగా ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. దీంతో పాటు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్, ముంబైలోని వాంఖడే స్టేడియంలో సెమీఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.

ఈ మైదానాల్లో ప్రపంచ కప్ మ్యాచ్‌లు

ICC ప్రపంచ కప్ 2023 ఉత్కంఠ పెరుగుతోంది. చాలా కాలం తర్వాత భారత్ 50 ఓవర్ల ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైంది. ఆ 12 నగరాల పేర్లు వెల్లడయ్యాయి. అహ్మదాబాద్‌తో పాటు ODI ప్రపంచ కప్ 2023 ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, ధర్మశాల, లక్నో, పూణె, త్రివేండ్రం, గౌహతి మైదానాల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ టోర్నీ సెమీ ఫైనల్స్‌ ముంబైలోని ఈడెన్‌ గార్డెన్‌, వాంఖడే స్టేడియంలో జరగనున్నాయి. ప్రపంచ కప్ 2023 టైటిల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మీడియా కథనాల ప్రకారం.. భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటే పాయింట్ల పట్టిక లేదా గ్రూప్‌లో టీమ్ ఇండియా స్థానంతో సంబంధం లేకుండా ముంబైలోని వాంఖడే స్టేడియంలో సెమీ ఫైనల్ నిర్వహిస్తారు.

Also Read: World Cup 2023: అంతరిక్షంలో వన్డే ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణ.. వైరల్ అవుతున్న వీడియో..!

బీసీసీఐ అధికారుల సమావేశం

వార్తా సంస్థ ANI ప్రకారం.. బీసీసీఐ అధికారులు ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ అధికారులతో సోమవారం అనధికారిక సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో ఐసీసీ నిబంధనలతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ODI ప్రపంచ కప్ 2023 భారతదేశంలోని 12 మైదానాల్లో జరగనుంది. కాగా ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. దీంతో పాటు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్, ముంబైలోని వాంఖడే స్టేడియంలో సెమీఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. అదే సమయంలో భారత జట్టు సెమీఫైనల్‌కు చేరితే ముంబైలోని వాంఖడే స్టేడియంలో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే ఈరోజు ఐసీసీ అధికారులు వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ ని విడుదల చేయనున్నట్లు సమాచారం.