Site icon HashtagU Telugu

MS Dhoni : ధోని బర్త్ డే స్పెషల్.. ఏపీలో 100 అడుగుల కటౌట్.. 300 మందికి అన్నదానం..

Mahendra Singh Dhoni Grand Birthday Celebrations in Andhra Pradesh with Huge 100 Feet Cutout

Dhoni

MS Dhoni : మహేంద్ర సింగ్ ధోని.. ఇండియా క్రికెట్ లో సక్సెస్ ఫుల్ కెప్టెన్సీ లో ఒకరు. ఎవరూ సాధించలేని రికార్దులు ధోని చాలా సాధించాడు. ICC లో అన్ని ఫార్మెట్స్ లోని వరల్డ్ కప్స్ సాధించి క్రికెట్ లో ఇండియాని అగ్రభాగాన నిలబెట్టాడు. తన ఆటతో ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్నాడు. అధికారిక క్రికెట్ నుంచి రిటైరయినా ధోని ఆట చూడాలనుకునే అభిమానుల కోసం ఇంకా ఐపీఎల్ ఆడుతున్నాడు. ఇండియాలో ధోనికి వీరాభిమానులు ఉన్నారు.

రాష్ట్రంతో సంబంధం లేకుండా అన్నిచోట్లా ధోనిని ప్రేమిస్తారు. మన ఏపీలో కూడా ధోనికి భారీగానే అభిమానులు ఉన్నారు. నేడు జులై 7 ధోని పుట్టిన రోజు. దీంతో దేశవ్యాప్తంగా అభిమానులు, పలువురు ప్రముఖులు ధోనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ధోని ఇప్పటికే తన భార్యతో కలిసి పుట్టిన రోజు సెలబ్రేషన్స్ చేసుకోగా ఆ వీడియోలు వైరల్ గా మారాయి.

అయితే ఏపీలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ దగ్గర అంబారుపేట గ్రామంలో ఉన్న ధోని అభిమానులు ధోని పుట్టిన రోజుని ఘనంగా సెలబ్రేట్ చేసారు. దాదాపు 100 అడుగుల ధోని కటౌట్ ని పెట్టి కేక్ కట్ చేసి ఘనంగా ధోని పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసారు. అలాగే ధోని పేరు మీద దాదాపు 300 మందికి అన్నదానం కూడా నిర్వహించారు. దీంతో వీళ్ళ అభిమానం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. సినిమా వాళ్ళకే కాదు క్రికెట్ వాళ్లకి కూడా ఈ రేంజ్ లో కటౌట్స్ పెడుతున్నారంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం ధోని 100 అడుగుల కటౌట్ వైరల్ గా మారింది. ఈ వీడియో ధోని వరకు వెళ్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

 

Also Read : Mahesh Babu : వెకేషన్ నుంచి తిరిగొచ్చిన మహేష్.. గడ్డంతో లుక్ అదిరిందిగా..