LSG vs CSK Preponed: అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియంలో మే 4న జరగాల్సిన లక్నో సూపర్‌జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరనున్న మ్యాచ్ లో కొంత మార్పు చోటు చేసుకుంది. ఒకరోజుకు ముందుకు జరిపి మే 3న మ్యాచ్ ను నిర్వహించనున్నారు బీసీసీఐ. ఈ మ్యాచ్ సమయంలోనూ కొంత మార్పు చేశారు. LSG vs CSK మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. వాస్తవానికి మే 4న లక్నోలో పౌర సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా ఈ మ్యాచ్ పై జిల్లా యంత్రాంగం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి తేదీని మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.
మే 4న లక్నోలో పౌర ఎన్నికలు జరగనుండటంతో భద్రతా ఏర్పాట్లు పెద్ద సమస్యగా మారాయి. ఈ మ్యాచ్ పై అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజీ మ్యాచ్ ను వీక్షించేందుకు లక్నో కాకుండా ఇతర జిల్లాల నుండి అభిమానులు వస్తారని భావిస్తుంది యాజమాన్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేరోజు మ్యాచ్‌లు, ఎన్నికలు నిర్వహించడం జిల్లా యంత్రాంగానికి పెద్ద సవాలుగా మారింది.
ఏకనా స్టేడియంలో తొలిసారిగా ఐపీఎల్‌ను నిర్వహిస్తున్నారు. లక్నో సూపర్ జెయింట్ తమ సొంత గ్రౌండ్ ఎకానా స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో రెండు మ్యాచ్‌లు జరిగాయి. ప్రస్తుతం ఇక్కడ ఏప్రిల్ 22, మే 1, మే 3, మే 16 తేదీల్లో నాలుగు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.
Read More: Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికుడి బీభత్సం.. బ్యాగ్ లో బాంబు ఉందంటూ హల్ చల్..!