Shoaib Akhtar: షోయెబ్ అక్త‌ర్ సోద‌రుడి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్న లష్కరే తోయిబా ఉగ్ర‌వాదులు

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలు తీవ్ర వివాదానికి, చర్చకు దారితీశాయి. భారత్‌లో భయంకరమైన దాడులకు పాల్పడిన లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకావడం ఇస్లామాబాద్‌లో కలకలం రేపింది. పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాదులు ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారో ఈ సంఘటన మరోసారి ప్రపంచానికి బహిర్గతం చేసింది. షోయబ్ అక్తర్ పెద్ద సోదరుడు షాహిద్ అక్తర్ ఈ నెల‌ 24న కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను ఇస్లామాబాద్‌లోని […]

Published By: HashtagU Telugu Desk
Lashkar-e-Taiba terrorists attended the funeral of Shoaib Akhtar's brother.

Lashkar-e-Taiba terrorists attended the funeral of Shoaib Akhtar's brother.

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలు తీవ్ర వివాదానికి, చర్చకు దారితీశాయి. భారత్‌లో భయంకరమైన దాడులకు పాల్పడిన లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకావడం ఇస్లామాబాద్‌లో కలకలం రేపింది. పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాదులు ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారో ఈ సంఘటన మరోసారి ప్రపంచానికి బహిర్గతం చేసింది.

షోయబ్ అక్తర్ పెద్ద సోదరుడు షాహిద్ అక్తర్ ఈ నెల‌ 24న కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను ఇస్లామాబాద్‌లోని హెచ్-8 శ్మశానవాటికలో నిర్వహించారు. అయితే, ఈ కార్యక్రమానికి 2025 పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి, లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి హాజరయ్యాడు. ఇతనితో పాటు లష్కరే రాజకీయ విభాగమైన పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్‌) అధ్యక్షుడు ఇనామ్ ఉర్ రెహ్మాన్ కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. వీరు బహిరంగంగా ఒక కార్యక్రమంలో పాల్గొనడం పాకిస్థాన్ ప్రభుత్వానికి తీవ్ర తలవంపులు తెచ్చిపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాక్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భారత్‌లో జరిగిన 26/11 ముంబై దాడులతో పాటు ఎన్నో విధ్వంసాలకు కారణమైన లష్కరే తోయిబా సంస్థను అంతర్జాతీయ సమాజం నిషేధించింది. ఈ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికే ఐక్యరాజ్యసమితిచే ఉగ్రవాదిగా గుర్తింపు పొందిన హఫీజ్ సయీద్, పీఎంఎంఎల్ అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ పార్టీ 2024 పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేయడం గమనార్హం. కసూరి లాంటి భయంకరమైన ఉగ్రవాదులు బహిరంగంగా తిరగడం, పాకిస్థాన్ ఉగ్రవాదానికి అండగా నిలుస్తోందన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు పాక్ వ్యవస్థలో ఎంతటి పలుకుబడి ఉందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

ఎవరీ సైఫుల్లా కసూరి?
భారత్‌కు సైఫుల్లా కసూరి అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులలో ఒకడు. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ఇతడే ప్రధాన సూత్రధారి అని భారత నిఘా వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ దాడిలో 25 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని అత్యంత తీవ్రంగా పరిగణించిన భారత్, పాకిస్థాన్‌తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ప్రతీకార చర్యలు చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని మురిద్కేలో ఉన్న లష్కరే ప్రధాన కార్యాలయంతో పాటు రావల్పిండి నుంచి సుక్కూర్ వరకు ఉన్న కీలక ఉగ్ర స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది.

భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్‌తో లష్కరే తీవ్రంగా దెబ్బతింది. అయినా కూడా కసూరి తన బుద్ధి మార్చుకోలేదు. భారత్‌పై విషం కక్కుతూనే ఉన్నాడు. మరోసారి 26/11 తరహాలో సముద్ర మార్గం గుండా దాడి చేస్తామని ఇటీవల హెచ్చరికలు జారీ చేశాడు. ఇంతటి ప్రమాదకరమైన ఉగ్రవాది పాకిస్థాన్ రాజధానిలో స్వేచ్ఛగా తిరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.

  Last Updated: 27 Jun 2026, 11:42 AM IST