Rishabh Pant: రిషబ్ పంత్ గాయం కారణంగా లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో వికెట్ కీపింగ్ చేయలేదు. ధ్రువ్ జురెల్ ఆ పాత్రను నిర్వహించాడు. గాయం తీవ్రతరం కాకుండా ఉండేందుకు టీమ్ ఇండియా పంత్ (Rishabh Pant)ను బ్యాటింగ్‌లో కూడా జాగ్రత్తగా ఆడించవచ్చని భావించారు. అయినప్పటికీ రెండో రోజు పంత్ బ్యాటింగ్‌కు దిగాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 19 పరుగులతో ఆడుతున్నాడు.
ఇంగ్లండ్ జట్టు 387 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత భారత జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. మొదటి రెండు మ్యాచ్‌లలో రాణించిన యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు. 107 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. అప్పుడు గాయంతో ఉన్న పంత్ బ్యాటింగ్‌కు దిగాడు. గాయంతో బ్యాటింగ్ చేస్తున్న పంత్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బ్యాటింగ్ సమయంలో ఫిజియో కూడా మైదానంలోకి వచ్చి అతని స్థితిని పరిశీలించాడు. అయినా, జట్టు అవసరం కోసం పంత్ బరిలోకి దిగాడు.
Also Read: Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కూలిపోవడానికి కారణం ఇదే!
శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కార పంత్‌ను ప్రశంసిస్తూ.. పంత్‌కు తర్వాత బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. అది అతనికి సులభమైనది కూడా. కానీ అతను జట్టు కోసం బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు అని అన్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ కూడా.. పంత్ ఒక టీమ్ మ్యాన్, చిన్న చిన్న విషయాలు జట్టుకు చాలా ముఖ్యం అని ప్రశంసించాడు. వీరితో పాటు సోషల్ మీడియాలో కూడా అభిమానులు పంత్‌ను ఎంతగానో కొనియాడారు.
ఇంగ్లాండ్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు సాధించింది. ఇందులో దిగ్గజ బ్యాట్స్‌మన్ జో రూట్ 104 పరుగులు చేశాడు. భారత జట్టు తరపున జస్‌ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 145 పరగులు చేసిందది. వికెట్ కీపర్ పంత్ (19), ఓపెనర్ కేఎల్ రాహుల్ (53) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ నుండి భారత జట్టు పెద్ద ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది. వీరి తర్వాత నీతీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్‌కు దిగనున్నారు.