Site icon HashtagU Telugu

IND vs BAN 2nd Test: రెండో టెస్ట్ కోసం తుది జట్టులో మార్పులు

IND vs BAN 2nd Test

IND vs BAN 2nd Test

IND vs BAN 2nd Test: భారత్ బంగ్లాదేశ్ మధ్య 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండో టెస్ట్ (2nd test) మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతుంది. ఇందుకోసం బీసీసీఐ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ కాన్పూర్ మరియు చెన్నై పరిస్థితులలో చాలా తేడా ఉంది. కాబట్టి కెప్టెన్ రోహిత్ శర్మ రెండో టెస్టులో ప్లేయింగ్ ఎలివేన్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే రెండో టెస్టులో టీమిండియా బ్యాటింగ్ యూనిట్‌లో మార్పులు చేయడం కష్టంగా కనిపిస్తోంది. (IND vs BAN)

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా కొనసాగుతారు.శుభ్‌మాన్ గిల్ మూడో స్థానంలో ఆడుతాడు. చెన్నై టెస్టులో గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు.దీంతో గిల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో వస్తాడు. చెన్నై టెస్టు సెంచరీయర్ రిషబ్ పంత్ 5వ స్థానంలో బరిలోకి దిగుతాడు. కేఎల్ రాహుల్ 6వ ర్యాంక్‌లో బ్యాటింగ్ చేస్తాడు. ఈ విధంగా చూస్తే భారత్ బ్యాటింగ్ యూనిట్‌లో మార్పు కష్టంగా కనిపిస్తోంది. అయితే బౌలింగ్ యూనిట్‌లో మార్పులు చేసే అవకాశముంది. వాస్తవానికి, గ్రీన్ పార్క్ స్టేడియం పిచ్‌పై స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. పిచ్‌ తొలిరోజు నుంచే స్పిన్నర్లకు సాయం అందుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ తుది జట్టులో స్పిన్నర్లను చేర్చుకునే అవకాశం కనిపిస్తుంది.

ఆకాశ్‌దీప్‌ స్థానంలో కుల్‌దీప్‌ యాదవ్‌ (kuldeep yadav)కు అవకాశం దక్కవచ్చు. చెన్నై టెస్టు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను కాన్పూర్ టెస్టులో చేర్చనున్నారు. ఈ ఇద్దరు ఆల్ రౌండర్లతో పాటుగా కుల్దీప్ యాదవ్ ను మూడో స్పిన్నర్గా బరిలోకి దించవచ్చు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ పేస్ దళాన్ని నడిపిస్తారు. పిచ్ పరిస్థితిని బట్టి టీమిండియా తుది జట్టులో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా మరియు మహ్మద్ సిరాజ్ భాగం కానున్నారు.

Also Read: IND vs BAN 2nd Test: గ్రీన్ పార్క్ లో టీమిండియా ట్రాక్ రికార్డ్