Koneru Humpy : ర్యాపిడ్ చెస్ వరల్డ్ ఛాంపియన్‌గా కోనేరు హంపి.. ఐదో స్థానంలో తెలంగాణ కుర్రాడు అర్జున్

తమిళనాడుకు చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ డి.గుకేశ్(Koneru Humpy) యంగెస్ట్ చెస్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచి భారత కీర్తిని ఇటీవలే ఇనుమడింపజేశారు.

Published By: HashtagU Telugu Desk
Koneru Humpy Rapid Chess World Champion World Rapid Crown India

Koneru Humpy : తెలుగు తేజం కోనేరు హంపి మరోసారి సత్తా చాటుకున్నారు. ఆమె తన అద్భుత ఆటతీరుతో ర్యాపిడ్ చెస్ వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించారు. అమెరికాలోని న్యూయార్క్‌లో 11 రౌండ్లలో జరిగిన వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో 8.5 పాయింట్లు సాధించి విజేతగా నిలిచారు. ఇవాళ ఈ పోటీల్లో భాగంగా 9,10,11 రౌండ్లు జరిగాయి. వీటిలో 9,10 రౌండ్లను ఆమె డ్రాగా ముగించారు. దీంతో 11వ రౌండ్ అత్యంత కీలకంగా మారింది. అందులో కోనేరు హంపి సత్తా చాటారు. 11వ రౌండ్‌లో విజయఢంకా మోగించారు.  ఇండోనేషియాకు చెందిన ఇరెనె సుకందర్‌ను 67 ఎత్తుల్లో మట్టికరిపించారు. దీంతో హంపికి విజయం ఖాయమైంది. ర్యాపిడ్  చెస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ను ఆమె  కైవసం చేసుకోవడం ఇది రెండోసారి.

Also Read :Plane Crash : మా దేశ విమానాన్ని కూల్చింది రష్యానే : అజర్‌బైజాన్ అధ్యక్షుడు

ఇంతకుముందు 2019లోనూ ఒకసారి ఆమె ఈ టోర్నీని గెల్చుకున్నారు. జు వెంజున్(చైనా) తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ఈ టోర్నీలో విజేతగా నిలిచిన ప్లేయర్‌గా హంపి రికార్డును సొంతం చేసుకున్నారు. ఇదే టోర్నీలో మరో తెలుగు గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక సైతం 8.0 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. తమిళనాడుకు చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ డి.గుకేశ్(Koneru Humpy) యంగెస్ట్ చెస్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచి భారత కీర్తిని ఇటీవలే ఇనుమడింపజేశారు. దాన్ని మరువకముందే ఇప్పుడు కోనేరు హంపి మనకు మరో గుడ్ న్యూస్‌ను వినిపించారు. చెస్‌లో భారత్ సత్తా ఏమిటో ప్రపంచానికి చూపించారు.

Also Read :Allu Arjun Arrest : అల్లు అర్జున్‌ అరెస్ట్ పై సముద్రఖని కామెంట్స్

తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేశి .. 

తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేశి 2026లో జరగబోయే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించాలనే టార్గెట్‌గా పెట్టుకున్నారు. అయితే ఆ లక్ష్యం నెరవేరలేదు. వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ పురుషుల విభాగంలో ఆయన 5వ స్థానానికి పరిమితమయ్యారు. ఇవాళ జరిగిన నాలుగు రౌండ్ల చెస్ మ్యాచ్‌లలో ఒక దాంట్లో మాత్రమే ఆయన గెలిచారు. రెండు డ్రాలు, ఒక ఓటమితో మొత్తంగా 9 పాయింట్లతో అర్జున్  ఐదో ప్లేసులో నిలిచారు. ఇక  భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద 8.5 పాయింట్లతో 17వ స్థానం సాధించారు.  రష్యాకు చెందిన 18 ఏళ్ల వోలార్ ముర్జిన్ 10 పాయింట్లతో విజేతగా నిలిచారు. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌ను ముందుండి నడిపిన ప్లేయర్‌గా అర్జున్‌ ఫేమస్ అయ్యారు. భారత్‌ తొలి చెస్  ఒలింపియాడ్‌లో గోల్డ్ మెడల్‌ను గెలవడంలో అర్జున్, గుకేశ్ ముఖ్య పాత్రను పోషించారు.

  Last Updated: 29 Dec 2024, 07:46 PM IST