Site icon HashtagU Telugu

Kohli & Sharma: డేటింగ్ అనగానే సీరియస్ అయింది అనుష్కతో లవ్ స్టోరీపై కోహ్లీ

Anushka Sharma-Virat Kohli

Kohli's 'awkward' Text To Anushka Sharma Before They Started Dating is 'goals'

టీమిండియాలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma) ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ ఓ యాడ్ షూటింగ్ తో మొదలైందన్నది అందరికీ తెలుసు.. అయితే ఎవరు ముందు ప్రపోజ్ చేశారు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. ఇటువంటి సీక్రేట్స్ ను తాజాగా కోహ్లీ బయటపెట్టాడు.

భారత క్రికెట్ కూ, బాలీవుడ్ కూ మధ్య లవ్ స్టోరీలు కొత్తేమీ కాదు. మన్సూర్ అలీఖాన్ పటౌడీ నుంచి విరాట్ కోహ్లీ వరకూ బాలీవుడ్ హీరోయిన్స్ తో ప్రేమాయణాలు నడిపిన వారే. వీరిలో చాలా మంది వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరి లవ్ స్టోరీ ఎలా మొదలైందో.. ఎవరు ఎవరికి ప్రపోజ్ చేసారో వంటి విషయాలపై అభిమానుల్లో ఆసక్తి ఉంటూనే ఉంటుంది. తాజాగా భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన లవ్ స్టోరీ సీక్రేట్స్ గురించి వెల్లడించాడు. బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మను ప్రేమించి పెళ్ళాడిన కోహ్లీ తన లవ్ స్టోరీ మొదలు.. తర్వాత జరిగిన విషయాల గురించి పంచుకున్నాడు. డివీలియర్స్ తో జరిగిన ఇంటర్యూలో కోహ్లీ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

మొదటిసారి అనుష్క శర్మను చూసినప్పుడు చాలా భయపడ్డానని చెప్పాడు. ఓ కమర్షియల్ యాడ్ షూటింగ్‌లో తొలిసారి అనుష్క శర్మను చూసానని చెప్పిన కోహ్లీ (Virat Kohli).. భయంతో ఏ మాట్లాడాలో అర్థం కాలేదన్నాడు. ఆమె అప్పటికే స్టార్ హీరోయిన్ కావడంతో.. తన వెన్నులో వణుకు పుట్టిందన్నాడు. అసలు ఆమెతో ఎలా యాక్ట్ చేయాలి, ఎలా మాట్లాడాలో అనే విషయమే అర్థం కాలేదన్నాడు.

యాడ్ షూటింగ్ తోనే అనుష్కతో తన పరిచయం మరింత పెరిగిందని కోహ్లీ చెప్పాడు. ఇద్దరి కుటుంబ నేపథ్యాలు సామాన్య మధ్యతరగతివే కావడంతో తొందరగా కనెక్ట్‌ అయ్యామని వివరించాడు. ప్రపోజ్ చేసే సమయంలో తాను ఎంత టెన్షన్ పడ్డాననేది కూడా కోహ్లీ ఈ ఇంటర్యూలో వెల్లడించాడు. అనుష్క శర్మకు ప్రపోజ్ చేయకుండా ముందు రెండు సందర్భాల్లో ఆమెకు ఇబ్బందికరమైన మెసేజ్‌లు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తుకున్నాడు. పరిచయమైన చాలా రోజుల తర్వాత డేటింగ్ చేశామనీ చెప్పాడు. తొలిరోజు నుంచే డేటింగ్ లో ఉన్నట్టు అనిపిస్తుందంటూ తాను పెట్టిన మెసేజ్ పై, అనుష్క ఒక్కసారిగా సీరియస్ అయ్యిందని చెప్పుకొచ్చాడు.

మాటల్లో పెట్టి ఆమె కోపాన్ని తగ్గించానని అసలు సంగతి చెప్పాడు. అయితే ఒక రోజు తన గురించి ఏమనుకుంటున్నావని ప్రశ్నించడంతో మళ్ళీ డేటింగ్ గురించి తాను చెప్పడం, అప్పుడు కూడా ఆమె కొద్దిగా ఇబ్బంది పడినట్లనిపించిందన్నాడు. క్రమంగా తన మనసును అర్థం చేసుకొని ఓ మంచి వ్యక్తిగా గుర్తించిందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. దాదాపు మూడేళ్ళకు పైగా లవ్ చేసుకున్న కోహ్లీ, అనుష్క 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. రెండేళ్ళ క్రితం ఈ జంట వామికాకు జన్మనిచ్చింది. మిస్టర్ 360 ఏబీ డీవిలియర్స్ కు ఇచ్చిన ఇంటర్యూలో కోహ్లీ చెప్పిన తన లవ్ స్టోరీ విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Also Read:  IND vs AUS 3rd ODI: చివరి వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్