Site icon HashtagU Telugu

World Cup 2023: కేఎల్ రాహుల్ కళ్ళు చెదిరే క్యాచ్

World Cup 2023 (38)

World Cup 2023 (38)

World Cup 2023: ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు టీమిండియా బంగ్లాదేశ్ తో తలపడుతుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా బంగ్లాపై అదే జోరును ప్రదర్శిస్తుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. తన్జిద్ హసన్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు. లిటన్ దాస్82 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లతో 66 పరుగులతో గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ పట్టిన క్యాచ్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. పక్షిలాగా గాళ్ళోకెగిరి అద్భుతంగ డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాహుల్ కీపింగ్ విన్యాసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ అద్భుతమైన క్యాచ్ ని టోర్నీ ఆఫ్ ద క్యాచ్ అంటూ కొనియాడుతున్నారు. మహమ్మద్ సిరాజ్ వేసిన 25వ ఓవర్‌ తొలి బంతి వేయగా బంగ్లా బ్యాటర్ మెహ్‌దీ హసన్ ఫైన్ లెగ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని కీపర్‌కు ఎడమవైపు దూసుకెళ్లింది. దీంతో కేఎల్ రాహుల్ సూపర్ డైవ్‌తో ఒంటి చేత్తో బంతిని అద్భుతంగా అందుకున్నాడు.ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సెకండ్ లో పక్షిలాగా గాళ్ళోకెగిరి క్యాచ్ అందుకున్నాడు.

భారత్ జట్టు – రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ మరియు మహ్మద్ సిరాజ్.

బంగ్లాదేశ్ జట్టు – లిటన్ దాస్, తంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), మెహదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్, తౌహిద్ హద్దే, మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్ మరియు షరీఫుల్ ఇస్లాం.

Also Read: World Cup 2023: భారత్ టార్గెట్ 257