KL Rahul: కేఎల్ రాహుల్ కళ్ళలో బాధ.. నిన్న మ్యాచ్ లో ఇది గమనించారా

టీమిండియాలో మోస్ట్ స్టైలిష్ బ్యాటర్​గా పేరు తెచ్చుకున్న కేఎల్ రాహుల్ టి20 ప్రపంచకప్ జట్టుకు సెలెక్ట్ కాకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. గాయంతో చాన్నాళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్ అద్భుతంగ రాణిస్తున్నాడు. ప్రపంచకప్ కు ముందు ఆసీస్ తో జరిగిన సిరీస్ లోను రాహుల్ బాగా ఆడాడు

KL Rahul: టీమిండియాలో మోస్ట్ స్టైలిష్ బ్యాటర్​గా పేరు తెచ్చుకున్న కేఎల్ రాహుల్ టి20 ప్రపంచకప్ జట్టుకు సెలెక్ట్ కాకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. గాయంతో చాన్నాళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్ అద్భుతంగ రాణిస్తున్నాడు. ప్రపంచకప్ కు ముందు ఆసీస్ తో జరిగిన సిరీస్ లోను రాహుల్ బాగా ఆడాడు. ప్రపంచకప్ చివరి మ్యాచ్ లో రాహుల్ గౌరవప్రదమైన పరుగులతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలోనూ కేఎల్ రాహుల్ ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. తన కెప్టెన్సీలో లక్నో సూపర్ జాయింట్స్ అదరగొడుతుంది. ఈ సీజన్లో లక్నో ఇప్పటిదాకా 10 మ్యాచ్ లు అడగా అందులో 6 గెలిచి నాలుగింటిలో ఓడింది.

లక్నో జట్టు విజయాల్లో రాహుల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వికెట్ల వెనుకాల ఉంటూ ప్లేయర్స్ ను అద్భుతంగ నడిపిస్తున్నాడు. బ్యాటింగ్ లోను ఫర్వాలేదనిపిస్తున్నాడు. అయితే కేఎల్ రాహుల్ లాంటి నిలకడైన ఆటగాడిని పొట్టి ప్రపంచకప్ కి ఎంపిక చేయకపోవడంతో సీనియర్ ఆటగాళ్లు బీసీసీఐ తీసుకున్ననిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఫస్ట్ ఛాయిస్ కీపర్​గా పంత్, అతడికి బ్యాకప్​గా సంజూ శాంసన్​ను ఎంపిక చేశారు. కానీ ఇన్నాళ్లూ టీమ్​తో ట్రావెల్ చేసిన రాహుల్​ను మాత్రం దూరం పెట్టారు. ఇది అతడ్ని తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. అయితే టీమ్​లో చోటు దక్కకపోవడంతో డిప్రెషన్​లోకి వెళ్లిపోయినట్లు కనిపిస్తున్నాడు కేఎల్.

We’re now on WhatsApp : Click to Join

నిన్న జరిగిన ముంబై ఇండియన్స్​మ్యాచ్​లో తనలో నిరాశ బయటకు కనిపించింది. టాస్ టైమ్​లో హార్దిక్​తో కలసి కేఎల్ రాహుల్ గ్రౌండ్​లోకి వచ్చాడు. టాస్ సమయంలో ఎప్పుడూ నవ్వుతూ హుషారుగా కనిపించే ఈ స్టార్ ఆటగాడు నిన్న మ్యాచ్ సమయంలో డల్​గా కనిపించాడు. అతడి కళ్లలో ఆ పెయిన్ క్లియర్​గా కనిపించింది. ముఖంలో నవ్వు లేదు.. వరల్డ్ కప్ బెర్త్ మిస్సయిందనే నిరాశాని తనను చాలా ఇబ్బంది పెడుతుంది. ఒకసారి మ్యాచ్ ని సరిగా గమనిస్తే రాహుల్ ఎంతలా ఫీల్ అవుతున్నాడో అర్ధం అవుతుంది. దీనికి సమబందించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా రాహుల్ ని ఎంపిక చెయ్యకపోవడంపై ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు. సీనియర్ ప్లేయర్​ను ఇలా అవమానించడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: POWERHOUSE Interview : మరో ‘పవర్’ ను ఇంటర్వ్యూ చేయబోతున్న TV9 రజనీకాంత్