LSG New Captain: లక్నో కెప్టెన్సీ నుంచి రాహుల్ ఔట్ ? కొత్త సారథిగా విండీస్ హిట్టర్

రిటెన్షన్ కు సంబంధించిన రూల్స్ రాగానే లక్నో తమ జట్టు పగ్గాలను కొత్త వ్యక్తికి అప్పగించబోతుందని సమాచారం. దీని ప్రకారం చూస్తే కెఎల్ రాహుల్ పై వేటు ఖాయమైనట్టు చెప్పొచ్చు. గత సీజన్ చివర్లో రాహుల్ కెప్టెన్సీపై లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Lsg New Captain

Lsg News Captain

LSG New Captain: ఐపీఎల్ మెగా వేలంపై ఫ్రాంచైజీలు ఫోకస్ పెంచాయి. రిటెన్షన్ రూల్స్ కు సంబంధించి అధికారిక ప్రకటన రాకున్న ఫ్రాంచైజీ ఓనర్లకు ఇప్పటికే బీసీసీఐ హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై అన్ని ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. కాగా వేలానికి ముందే లక్నో సూపర్ జెయింట్స్ తమ కొత్త కెప్టెన్ ను ప్రకటించేందుకు రెడీ అవుతోంది.

రిటెన్షన్ కు సంబంధించిన రూల్స్ రాగానే లక్నో తమ జట్టు పగ్గాలను కొత్త వ్యక్తికి అప్పగించబోతుందని సమాచారం. దీని ప్రకారం చూస్తే కెఎల్ రాహుల్ పై వేటు ఖాయమైనట్టు చెప్పొచ్చు. గత సీజన్ చివర్లో రాహుల్ కెప్టెన్సీపై లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. సన్ రైజర్స్ తో మ్యాచ్ సందర్భంగా బౌండరీ లైన్ దగ్గరే రాహుల్ పై గోయెంకా ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత నుంచీ రాహుల్ మరొక జట్టుకు మారబోతున్నాడన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మెగా వేలానికి ముందే రాహుల్ లక్నో రిలీజ్ చేస్తుందని భావిస్తున్నారు.

అతని స్థానంలో కెప్టెన్సీ కోసం ఇద్దరు ప్లేయర్స్ రేసులో నిలిచారు. విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్, ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాలలో ఒకరికి కెప్టెన్సీ అప్పగించే ఛాన్సుంది. పూరన్ ను ఖచ్చితంగా రిటైన్ చేసుకోనున్న లక్నో అతనివైపే మొగ్గుచూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా షార్ట్ ఫార్మాట్ లో ఈ విండీస్ హిట్టర్ దుమ్మురేపుతున్నాడు. విధ్వంసకర ఇన్నింగ్స్ లతో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్నాడు. గత సీజన్ లోనూ పూరన్ భారీ ఇన్నింగ్స్ లు ఆడాడు. దీంతో అతనికే కెప్టెన్సీ దక్కే అవకాశాలున్నాయి. అదే సమయంలో కృనాల్ అవకాశాలను కొట్టిపారేయలేమని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లపై ఇటీవలే రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ వ్యాపారం కాదని, ఆటగాళ్ళను గౌరవించాలంటూ వ్యాఖ్యానించాడు. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకాను ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశాడన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే రెండురోజుల క్రితం రాహుల్ సంజీవ్ గోయెంకాతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం మీద లక్నో సూపర్ జెయింట్స్ కు సంబంధించి ఈ వారంలో కీలక ప్రకటన వెలువడే అవకాశముందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read: Megastar Chiranjeevi Viswambhara : విశ్వంభర బిజినెస్ కు భారీ డిమాండ్..!

  Last Updated: 27 Aug 2024, 09:55 PM IST