Site icon HashtagU Telugu

KL Rahul New House: కేఎల్ రాహుల్ టేస్ట్ అదిరిందిగా.. 20 కోట్లతో ఇంద్రభవనం

KL Rahul New House

KL Rahul New House

KL Rahul New House: టీమిండియా జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ శ్రీలంకతో జరగనున్న టి20 మరియు వన్డే సిరీస్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇటీవల జరిగిన టి20 ప్రపంచకప్ కు రాహుల్ ని సెలెక్ట్ చేయలేదు. అయితే ఈ గ్యాప్ లో రాహుల్ ఎం చేశాడో తెలుసా. ఖాళీగా ఉండటం ఎందుకని ఇంటిని ప్లాన్ చేశాడు. రాహుల్ మరియు అతని వైఫ్ అతియా శెట్టి ముంబైలోని ఓ పాష్ ఏరియాలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. 3350 చదరపు విస్తీర్ణంలో ఉన్న ఈ లగ్జరీ ఫ్లాట్ కోసం 20 కోట్లు వెచ్చించారట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నడుస్తుంది.

కేఎల్ రాహుల్ కొనుగోలు చేసిన అపార్ట్మెంట్ లో స్విమ్మింగ్ పూల్, జిమ్, స్పా మరియు ప్రైవేట్ థియేటర్‌తో సహా అనేక సౌకర్యాలు ఉన్నాయి. అపార్ట్మెంట్లో 24/7 భద్రతా వ్యవస్థ ఉంది. అపార్ట్‌మెంట్‌ను సమకాలీన శైలిలో రూపొందించినట్లు సమాచారం. ఇది పెద్ద కిటికీలను కలిగి ఉంటుంది, వెళుతూరు అన్ని గదుల్లోకి ప్రవేశించేలా డిజైన్ చేశారట. నాలుగు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసేందుకు దంపతులు రూ.1.20 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు.

ముంబైలోని పాలి హిల్‌ లో వీరి అపార్ట్ మెంట్ ఉంది. అంతేకాదు ఆ ప్రాంతాన్ని సినీ మరియు బిజినెస్ మెన్ల హబ్‌ గా పిలుస్తారు. అక్కడ అమీర్‌ఖాన్‌, ఇతర బాలీవుడ్ స్టార్లకు ఇళ్లు ఉన్నాయి. సమీపంలోని బాంద్రాలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ వంటి పెద్ద స్టార్ల ఇల్లు కూడా అక్కడే ఉన్నాయి. రాహుల్ తాజాగా జరిగిన అనంత్ అంబానీ,రాధిక మర్చంట్‌ల వివాహానికి హాజరు అయ్యాడు.

Also Read: Viral Catch: క్రికెట్ లో అరుదైన డిస్మిస్ క్యాచ్