Sanju Samson: టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ (Sanju Samson) ఈ రోజుల్లో హాట్ టాపిక్‌గా మారాడు. ఆసియా కప్ 2025లో అతడు వికెట్ కీపర్‌గా ఆడతాడా లేదా అనే ఊహాగానాలతో పాటు ఐపీఎల్ 2026లో కూడా అతడు జట్టును మారుస్తాడా అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఐపీఎల్‌లో చాలా కాలంగా రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా ఉన్న సంజూ శాంసన్ గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో ఇతర ఫ్రాంచైజీలు అతనిపై దృష్టి సారించాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సంజూ శాంసన్‌ను తమ జట్టులోకి తీసుకోవాలనుకుంటుందని పుకార్లు వినిపించాయి. ఇప్పుడు ఈ రేసులో మూడుసార్లు ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కూడా చేరింది.
కేకేఆర్ ఆఫర్
నివేదికల ప్రకారం.. కేకేఆర్ యాజమాన్యం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను తమ జట్టులో చేర్చుకోవడానికి ఆసక్తి చూపింది. దీనికి బదులుగా కేకేఆర్ తమ జట్టులోని యువ ఆటగాళ్లైన అంగక్రిష్ రఘువంశీ (రూ. 3 కోట్లు) లేదా రమణదీప్ సింగ్ (రూ.4 కోట్లు)లో ఒకరిని ఎంచుకోవాలని రాజస్థాన్‌కు ఆఫర్ ఇచ్చింది. అయితే రాజస్థాన్ రాయల్స్ సంజూ శాంసన్‌ను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది కాబట్టి, ఈ ట్రేడ్ జరగడం కష్టంగా మారింది.
సీఎస్‌కే ఆసక్తి
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా సంజూ శాంసన్‌పై ఆసక్తి చూపింది. అయితే సంజూ శాంసన్‌కు బదులుగా రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్ లేదా శివమ్ దూబే వంటి కీలక ఆటగాళ్లను ఇవ్వడానికి చెన్నై సుముఖంగా లేదని తెలుస్తోంది.
రాజస్థాన్‌లోనే శాంసన్
అయితే తాజా నివేదికల ప్రకారం.. సంజూ శాంసన్ ఐపీఎల్ 2026 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ నుండి ట్రేడ్ కావాలని లేదా విడుదల కావాలని అభ్యర్థించినట్లు పుకార్లు వచ్చాయి. కానీ, రాజస్థాన్ యాజమాన్యం అతన్ని ట్రేడ్ చేయకూడదని నిర్ణయించింది. దీంతో సంజూ శాంసన్ ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా కొనసాగనున్నారు.