Site icon HashtagU Telugu

Kavya Maran Erupts In Joy : కావ్య పాప మ‌ళ్లీ నవ్వింది.. ప‌క్క‌న ఉన్న అమ్మాయి ఎవ‌రంటే?

Northern Superchargers

Northern Superchargers

Kavya Maran Erupts In Joy : ఐపీఎల్ (IPL) చూసేవారికి కావ్య మార‌న్ (Kavya Maran) గురించి పరిచ‌యం అక్క‌ర‌లేదు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (Sunrisers Hyderabad) స‌హ య‌జ‌మాని అయిన ఆమెకు క్రికెట‌ర్ల‌కు మించిన ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. ఆమె కోస‌మే కొంద‌రు మ్యాచ్‌ల‌ను చూస్తారంటే అందులో ఎలాంటి అతిశ‌యోక్తి లేదేమో. ఎస్ఆర్‌హెచ్ (SRH) ఆడే అన్ని మ్యాచ్‌ల‌కు హాజ‌రవుతూ జ‌ట్టును ఉత్సాహ‌ప‌రుస్తూ ఉంటుంది. గెలుపోట‌ముల త‌రువాత ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెష‌న్స్‌కు ఎంతో మంది ఫిదా అవుతుంటారు.

హీరోయిన్ల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని అందం ఆమె సొంతం కావ‌డంతో కాస్త స‌మ‌యం దొరికితే చాలు.. కెమెరామెన్లు త‌మ కెమెరాల‌ను ఆమె వైపుకే తిప్పేస్తుంటారు. గెలిచిన సంద‌ర్భాల్లో గెంతులేయ‌డం, ఓడిపోతే నిరాశ‌తో బుంగ‌మూతి పెట్టుకునే కావ్య మార‌న్ చిత్రాలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి.

తాజాగా ఉప్ప‌ల్ మైదానంలో జ‌రిగిన SRH vs CSK మ్యాచ్‌కు ఆమె హాజ‌రైంది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్ట‌పోయి 165 ప‌రుగులు చేయ‌గా ల‌క్ష్యాన్ని స‌న్‌రైజ‌ర్స్ 18.1 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మ్యాచ్ గెల‌వ‌గానే స్టాండ్స్‌లో ఉన్న కావ్య మార‌న్ ఒక్క‌సారిగా ఎగిరి గెంతులు వేసింది. ఆనందంతో చ‌ప్ప‌ట్లు కొడుతూ జ‌ట్టును అభినందించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

దీనితో పాటు కావ్య మార‌న్ ఓ అమ్మాయితో ఉన్న ఫోటో సైతం నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. దీంతో ఆ అమ్మాయి ఎవ‌రు అని అంటూ ఆరాలు తీసే ప‌నిలో ఉన్నారు. కాగా.. ఆమె మ‌రెవ‌రో కాదు సీఎస్‌కే తో మ్యాచ్‌లో చెల‌రేగి ఆడిన ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ సోద‌రి.

Alsso Read : IPL 2024: హార్దిక్ కి అండగా దాదా.. అతని తప్పేముందంటూ మద్దతు