Maharaja Trophy 2023: ఒకప్పుడు బీసీసీఐ పట్టించుకోని కరణ్ నాయర్ లీగ్ మ్యాచ్ లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. టెస్ట్ మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఈ ఆటగాడికి టీమిండియాలో సరైన అవకాశాలు దక్కలేదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే కరణ్ మాత్రం క్రికెట్ ని వదిలిపెట్టలేదు. ఆటపై ఇష్టం ఉండాలే గానీ టీమిండియా అయితే ఏంటి లీగ్ మ్యాచ్ లు అయితే ఏంటి బ్యాట్ పట్టినమా.. సిక్సర్ బాదేశమా ఇదే కరణ్ మంత్రం. అందుకే కాబోలు భారత్ జట్టుకు దూరంగా ఉంటు లీగ్ లలో ఆడుతున్నాడు. అయితే ఆడటం అంటే అలాంటి ఇలాంటి ఆట కాదు. 40 బంతుల్లో సెంచరీ చేశాడు ఈ యువ క్రికెటర్.
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహారాజా టీ20 టోర్నీ జరుగుతుంది. గుల్భర్గా మిస్టిక్స్, మైసూర్ వారియర్స్ మధ్య జరిగిన రెండో సెమి ఫైనల్ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ కు దిగిన మైసూర్ వారియర్స్ 2 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 248 పరుగులు చేసింది.. 249 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుల్భర్గా టీమ్ పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
మైసూర్ వారియర్స్ జట్టు తరపున బరిలోకి దిగిన కరణ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నాయర్ ఊచకోతకు ప్రత్యర్థి బౌలర్లు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. అతని బ్యాటింగ్ చేస్తుంటే ప్రత్యర్థి ఆటగాళ్లు ప్రేక్షక పాత్ర వహించడమే తప్ప మరో అవకాశం లేకుండా పోయింది. 42 బంతులు ఎదుర్కొన్న కరణ్ 7 ఫోర్లు, 9 సిక్సరల్ల సహాయంతో 107 పరుగుల భారీ స్కోర్ రాబట్టాడు. ఇన్నింగ్స్ లో కేవలం 40 బంతుల్లోనే శతకం బాది సెలక్టర్లకు తన బ్యాట్ తో సమాధానమిచ్చాడు. పైగా 254 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయడం విశేషం. ఇక కరుణ్ నాయర్ కు తోడుగా సమర్థ్ బెస్ట్ ఫెరఫార్మెన్స్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ లో 50 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 80 విలువైన పరుగులు సాధించాడు.
Also Read: Vijayawada MP Seat : జగన్ మాస్టర్ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందా..?