Kapil Dev Blasts : వాళ్లకు అహంకారం తలకెక్కింది.. ఇండియా టీమ్ ప్లేయర్స్ పై కపిల్ దేవ్ కామెంట్స్

Kapil Dev Blasts : ఇండియా క్రికెట్ టీమ్ లోని ప్లేయర్స్ తీరుపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Updated On - July 30, 2023 / 02:48 PM IST

Kapil Dev Blasts : ఇండియా క్రికెట్ టీమ్ లోని ప్లేయర్స్ తీరుపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

1983లో భారత జట్టుకు ప్రపంచ కప్‌ను అందించిన నాటి కెప్టెన్ కపిల్ దేవ్ ప్రస్తుత టీమిండియా ఆటగాళ్ళపై మండిపడ్డారు.

“భారత బ్యాటర్లలో కొందరు  తమకు అన్నీ తెలుసు అన్నట్టుగా అహంభావంతో  వ్యవహరిస్తుండటం అతిపెద్ద నెగెటివ్ పాయింట్. సునీల్ గవాస్కర్ లాంటి లెజెండ్లతో మాట్లాడేందుకు వాళ్లకు నామోషీ ఎందుకు ?” అని ఆయన పేర్కొన్నారు. 

“ది వీక్‌” కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ ఈ కామెంట్స్ చేశారు.

Also read : Hirsh Vardhan Singh: అమెరికా అధ్యక్ష రేసులో మరో ప్రవాస భారతీయుడు.. ఎవరీ హర్ష్‌వర్దన్‌ సింగ్‌..?

అన్నీ తెలుసు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు

“IPL టోర్నీలతో ఇండియా టీమ్ క్రికెటర్లు బాగా సంపాదిస్తుండటం సంతోషకరమే. అయితే దీనివల్ల కొందరు క్రికెటర్లకు అహంకారం పెరిగింది. ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ .. వాళ్లలో అతి విశ్వాసం పెరిగింది. కొందరు ప్లేయర్స్ తమకు అన్నీ తెలుసు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఎవరినీ ఏమీ అడగాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారు.. అనుభవం ఉన్న ప్లేయర్స్ మీకు  గైడెన్స్ ఇస్తే బాగుంటుందని నేను విశ్వసిస్తున్నా” అని కపిల్ (Kapil Dev Blasts) అభిప్రాయపడ్డారు.

Also read : Gog Saved : కుక్క విశ్వాసం అంటే ఇదే మరి..

వాళ్లకు ఏమీ తెలియదు.. 

“మైదానంలో సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజం ఉన్నపుడు ఆయనతో మాట్లాడి సలహాలను తీసుకోవడానికి ఇండియా టీమ్  ప్లేయర్స్ కు అభ్యంతరం ఎందుకు ? 50 సీజన్ల క్రికెట్‌ను చూసిన గవాస్కర్‌తో మాట్లాడేందుకు వాళ్లకు నామోషీ ఎందుకు ? తమకు అంతా తెలుసని వాళ్ళు అనుకుంటున్నారు. వాస్తవానికి వాళ్లకు ఏమీ తెలియదు” అని  కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు.