Kane Williamson: న్యూజిలాండ్ జట్టుకు గుడ్ న్యూస్.. కేన్ మామ వచ్చేస్తున్నాడు.. వరల్డ్ కప్ కి ముందే జట్టులోకి..?

అక్టోబర్ 5 నుండి భారతదేశంలో ప్రారంభమయ్యే ICC వన్డే ప్రపంచ కప్‌కు ముందు కేన్ విలియమ్సన్ (Kane Williamson) ఫిట్‌నెస్ విషయంలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు పెద్ద ఉపశమనం లభించింది.

  • Written By:
  • Publish Date - August 5, 2023 / 07:33 AM IST

Kane Williamson: అక్టోబర్ 5 నుండి భారతదేశంలో ప్రారంభమయ్యే ICC వన్డే ప్రపంచ కప్‌కు ముందు కేన్ విలియమ్సన్ (Kane Williamson) ఫిట్‌నెస్ విషయంలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు పెద్ద ఉపశమనం లభించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టులో భాగమైన విలియమ్సన్ ఒక మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కాలికి తీవ్ర గాయమైంది. దీని తర్వాత అతను మొత్తం ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉండటంతో పాటు చాలా కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా దూరమయ్యాడు.

న్యూజిలాండ్ జట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ద్వారా కేన్ విలియమ్సన్ ఇప్పుడు తన పునరాగమనం గురించి పెద్ద అప్‌డేట్ ఇచ్చాడు. ఈ వీడియోలో కేన్ కోలుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. అదే సమయంలో అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా కనిపించాడు. ఈ వీడియోలో కెన్ జిమ్‌లో సమయం గడపడం కూడా కనిపించింది.

వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆడాల‌ని ఉంద‌ని అత‌ను ఇప్ప‌టికే ఆశాభావం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. అనుకున్న‌ట్టుగానే వేగంగా కోలుకుంటున్న అత‌ను బ్యాట్ ప‌ట్ట‌డంతో న్యూజిలాండ్ అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. న్యూజిలాండ్ జ‌ట్టు గొప్ప కెప్టెన్ల‌లో ఒక‌డైన కేన్ విలియ‌మ్స‌న్ క్రికెట్‌కు దూర‌మైన ఐదు నెల‌ల‌పైనే కావొస్తోంది.

Also Read: MSDCA : ధోనీ స్కూల్ ప్రీమియ‌ర్‌ లీగ్ పోస్ట‌ర్ ఆవిష్క‌రించిన చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్లేయ‌ర్ ర‌షీద్‌

బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు విలియమ్సన్

వన్డే ప్రపంచ కప్ కోసం సన్నాహాల కోణం నుండి సెప్టెంబర్ 21న ప్రారంభమయ్యే ఈ మెగా ఈవెంట్ ప్రారంభానికి ముందు న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్‌తో 3 మ్యాచ్‌ల ODI సిరీస్‌ను ఆడుతుంది. ఈ సిరీస్‌లో కేన్ విలియమ్సన్ పునరాగమనం చేస్తాడని అటు కేన్ అభిమానులు, న్యూజిలాండ్ జట్టు ఎదురుచూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్ జట్టుకు ఇది పెద్ద వార్తగా భావించవచ్చు.

రెండు రోజుల క్రితం న్యూజిలాండ్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఈ విషయాన్నీ విలియమ్సన్ స్వయంగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోను పంచుకున్నాడు. అందులో అతను బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌కు విలియమ్సన్ కీలక పాత్ర పోషించగలడు. కేన్ విలియమ్సన్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 94 టెస్టులు, 161 వన్డేలు, 87 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. అతను 164 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 54.86 సగటుతో 8124 పరుగులు, 153 ODIలలో 47.85 సగటుతో 6555 పరుగులు, 85 T20 ఇంటర్నేషనల్‌లలో 33.3 సగటుతో 122.89 స్ట్రైక్ రేట్‌తో 2464 పరుగులు చేశాడు.