Site icon HashtagU Telugu

Jofra Archer: ముంబైకి షాక్… గాయంతో ఆర్చర్ ఔట్

Jofra

Jofra

Jofra Archer: ఐపీఎల్ 16వ సీజన్ లో పడుతూ లేస్తూ సాగుతున్న ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సీజన్ మొత్తానికీ దూరమయ్యాడు. గాయంతో స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. దీంతో అతని స్థానంలో క్రిస్ జోర్డాన్ ను ముంబై తీసుకుంది.

గత సీజన్ లో కూడా ఆర్చర్ ఆడలేదు. ఈ సీజన్ ఆరంభంలోనే స్టార్ బౌలర్ బూమ్రా దూరమవడంతో ముంబై ఆర్చర్ పైనే ఆశలు పెట్టుకుంది. అయితే కొన్ని మ్యాచ్ లు ఆడినా ఈ ఇంగ్లండ్ పేసర్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఫిట్ నెస్ సమస్యలతో కొన్ని మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఇప్పుడు గాయంతో సీజన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ఆర్చర్ 40 ఐపీఎల్ మ్యాచ్ లలో 48 వికెట్లు పడగొట్టాడు. తరచూ గాయాలతో ఇబ్బంది పెడుతూ ఎక్కువ సీజన్లు ఆదలేకపోయాడు. ఈ సీజన్ లో 5 మ్యాచ్ లలో కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. ఇదిలా ఉంటే
జోర్డాన్ రాకతో ముంబై బౌలింగ్ ఎటాక్ కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్ లో ముంబై నిలకడగా రాణించడం లేదు. గత మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఘోర పరాజయం పాలయింది. బ్యాటింగ్ లో రోహిత్ వైఫల్యం ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన అన్ని మ్యాచ్ లలోనూ ముంబై గెలవాల్సిందే.

Also Read: MI vs RCB: ఒకే ఫ్రేమ్‌లో 59679