ICC AGM: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC AGM) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) శుక్రవారం కొలంబోలో జరగనుంది. దీనికి సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జై షా శ్రీలంకకు వెళ్లే అవకాశం ఉంది. ఏజీఎంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. వీటిలో ఒకటి కొత్త ఛైర్మన్‌కు సంబంధించినది. నివేదికల ప్రకారం.. ఐసిసి తదుపరి ఛైర్మన్‌గా జై షాను నియమించవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.
ఐసీసీ చైర్మన్‌గా ప్రస్తుతం న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లే ఉన్నారు. ఓ నివేదిక ప్రకారం.. జై షా ఐసిసి చైర్మన్ కావడం దాదాపు ఖాయమైంది. ఈ విషయంపై ఐసీసీకి సంబంధించిన ఒక మూలాధారం మాట్లాడినట్లు తెలిపింది. ఇప్పుడు జై షా ఎప్పుడు ఛైర్మన్ అవుతాడన్నదే ప్రశ్న. బీసీసీఐ సెక్రటరీగా అతనికి ఏడాది గడువు ఉంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిబంధనల ప్రకారం జై షాకి కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది. అతను 2025లో బాధ్యతలు స్వీకరిస్తే..ర్ బార్క్లే తన మూడవ పదవీకాలాన్ని పూర్తి చేయలేరు. అతని పదవీకాలం డిసెంబర్ 2024 నుండి డిసెంబర్ 2026 వరకు ఉంటుంది.
Also Read: Shreyas Iyer: టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్.. శ్రీలంకపై రికార్డు ఎలా ఉందంటే..?
ఇటీవల T20 ప్రపంచకప్ 2024 USA, వెస్టిండీస్‌లో జరిగింది. ఈ టోర్నీలో ఐసీసీకి దాదాపు రూ.160 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఓ నివేదిక పేర్కొంది. కాబట్టి దీని గురించి AGMలో కూడా చర్చించవచ్చు. ఇది సమావేశంలో అతిపెద్ద చర్చనీయాంశంగా మారవచ్చు. దీంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్థాన్‌లో జరగనుంది. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు టీమిండియా సిద్ధంగా లేదు. ఈ అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు రావచ్చు. నివేదికల ప్రకారం.. టీమిండియా తన మ్యాచ్‌లను దుబాయ్ లేదా శ్రీలంకలో జరిగేలా ప్లాన్ చేస్తోంది. అందువల్ల ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలా..? లేదా అనేది కూడా స్ఫష్టత రానుంది.
We’re now on WhatsApp. Click to Join.