Site icon HashtagU Telugu

IND vs WI 2nd T20: ఒక వికెట్ తో హార్దిక్ పాండ్యా రికార్డ్

IND vs WI

New Web Story Copy 2023 08 05t182242.644

IND vs WI 2nd T20: హార్దిక్ పాండ్యా సారధ్యంలో రేపు ఆదివారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ హార్దిక్ కి స్పెషల్ మ్యాచ్ కాబోతుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో హార్దిక్ ఒక్క వికెట్ పడగొట్టినా బుమ్రాను వెనక్కినెట్టి నాలుగో స్థానంలోకి వస్తాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ నుంచి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో ఇప్పటివరకు బుమ్రా మొత్తం 70 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ కూడా 70 వికెట్లతో సరిసమానంగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో గయానా వేదికగా జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఒక్క వికెట్ పడగొట్టినా, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ నుంచి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో పాండ్య నాలుగో స్థానంలోకి వచ్చి చేరుతాడు. బుమ్రా 60 మ్యాచుల్లో 70 వికెట్లు తీయగా, హార్దిక్ 77 మ్యాచ్‌లు ఆడి 70 వికెట్లు తీశాడు.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్‌ నుంచి అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజువేంద్ర చాహల్‌ పేరిట ఉంది. చాహల్ పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటివరకు 76 మ్యాచ్‌ల్లో మొత్తం 93 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో భువనేశ్వర్ నిలిచాడు. భువి 87 మ్యాచుల్లో 90 వికెట్లు పడగొట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ 65 మ్యాచుల్లో 72 వికెట్లు తీసి థర్డ్ ప్లేస్ లో ఉండగా జస్ప్రీత్ బుమ్రా 60 మ్యాచుల్లో 70 వికెట్లు తీసి ఫోర్త్ ప్లేస్ కైవసం చేసుకున్నాడు. హార్దిక్ 77 మ్యాచ్‌లు ఆడి 70 వికెట్లు తీశాడు.

Also Read: Hyderabad: కాల్పుల్లో మరణించిన బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, 2BHK ఫ్లాట్