Jasprit Bumrah: భారతీయ క్రికెట్ అభిమానులకు శుభవార్త వచ్చింది. జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆసియా కప్ 2023కి ముందు జట్టులో చేరనున్నట్లు తెలుస్తుంది. నివేదికల ప్రకారం.. ఆగస్టులో ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ ద్వారా బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నాడు. జస్ప్రీత్ బుమ్రా తన చివరి మ్యాచ్‌ను సెప్టెంబర్ 2022లో ఆస్ట్రేలియాతో ఆడాడు. మార్చిలో బుమ్రా వెన్నులో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం బుమ్రా నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాస ప్రక్రియలో ఉన్నాడు. ఓ నివేదిక ప్రకారం.. ఐర్లాండ్‌తో T20I సిరీస్ సందర్భంగా బుమ్రాకు ఆసియా కప్, ప్రపంచ కప్ 2023 ఆడటానికి చాలా సమయం లభిస్తుంది. ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్ తర్వాత టీమిండియా సెప్టెంబర్ నుండి ఆసియా కప్ ఆడనుంది.
ఐర్లాండ్ సిరీస్‌కు బుమ్రా తిరిగి రావడం దాదాపు ఖాయం
బుమ్రా కోలుకోవడం చూసిన బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న ఐర్లాండ్ సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా చాలా బాగా కనిపిస్తున్నాడు. ఇది భారత క్రికెట్ జట్టుకు పెద్ద ఊపునిస్తుంది. గాయం కారణంగా చాలా కాలం పాటు దూరమైన తర్వాత బుమ్రా కూడా క్రీజులో గడిపే అవకాశం లభించనుంది. అంతా సవ్యంగా సాగితే బుమ్రా రంగంలోకి దిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
Also Read: Murugan Ashwin: తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో అద్భుతమైన క్యాచ్.. డైవ్ చేసి మరీ పట్టాడు..!
పర్యవేక్షణలో ఉన్నాడు
NCAకి వచ్చిన తర్వాత జస్ప్రీత్ బుమ్రా.. ఛైర్మన్ VVS లక్ష్మణ్, స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్ నితిన్ పటేల్ పర్యవేక్షణలో ఉన్నారు. నితిన్ పటేల్ గతంలో ముంబై ఇండియన్స్, భారత క్రికెట్ జట్టుకు చీఫ్ ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేశారు. NCAలో అతను ఫాస్ట్ బౌలర్‌తో కలిసి పనిచేసే అవకాశం పొందాడు. VVS లక్ష్మణ్, నితిన్ పటేల్ కాకుండా ఫిజియో S రజనీకాంత్ తన ప్రణాళిక ప్రకారం కోలుకుంటున్నట్లు నిర్ధారించడానికి బౌలర్‌తో సన్నిహితంగా పనిచేస్తున్నారు. ఎస్. రజనీకాంత్ ఢిల్లీ క్యాపిటల్స్ సపోర్ట్ టీమ్‌లో భాగంగా ఉన్నారు. అదే సమయంలో అతను గతంలో గాయాల నుండి కోలుకోవడానికి శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, మురళీ విజయ్ వంటి ఆటగాళ్లకు సహాయం చేశాడు.
భారత జట్టు ఆగస్టులో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇరుజట్లు మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఆగస్టు 18, 20, 23వ తేదీన ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. స్వదేశంలో ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్ లో బుమ్రా కీలకం కానున్నాడు. ఆలోపు అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించాలని ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు. వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5న షురూ కానుంది.