Site icon HashtagU Telugu

Jasprit Bumrah: ఐసీసీ అవార్డుల్లో భారత్ హవా.. మేటి టెస్ట్ క్రికెటర్ గా బుమ్రా!

Jasprit Bumrah

Jasprit Bumrah

Jasprit Bumrah: ఐసీసీ వార్షిక అవార్డుల్లో భారత క్రికెటర్ల హవా కొనసాగుతోంది. అటు మహిళల క్రికెట్, ఇటు పురుషుల క్రికెట్ లో గత ఏడాది సత్తా చాటిన మన ప్లేయర్స్ పలు పురస్కారాలు దక్కించుకున్నారు. తాజాగా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు. గ్లండ్ మాజీ కెప్టెన్ జోరూట్, శ్రీలంక ప్లేయర్ కామిందు మెండిస్, ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌లను వెనక్కి నెట్టి బుమ్రా ఈ అవార్డును అందుకున్నాడు. ఈ క్రమంలో టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డ్ అందుకున్న ఆరో భారత క్రికెటర్‌గా బుమ్రా నిలిచాడు.గతేడాది టెస్ట్‌ల్లో బుమ్రా అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. 13 టెస్ట్‌ల్లో 71 వికెట్లు పడగొట్టాడు. గతేడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డ్ సృష్టించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే బుమ్రా 32 వికెట్లు పడగొట్టాడు.

గతేడాది టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. బుమ్రా తర్వాత ఇంగ్లండ్‌ పేసర్‌ గస్‌ అట్కిన్సన్‌ 11 మ్యాచ్‌ల్లో 52 వికెట్లు తీశాడు. బుమ్రా టెస్ట్‌ల్లో తన అసమాన ప్రదర్శనతో నంబర్‌ వన్‌ ర్యాంక్‌ బౌలర్‌గానూ నిలిచాడు. భారత్‌ తరఫున అత్యధిక రేటింగ్‌ పాయింట్లు పొందిన బౌలర్‌గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. బుమ్రా గతేడాది సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాలపై అనేక సంచలన స్పెల్స్ తో అదరగొట్టాడు. ఇటీవల ముగిసిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో బుమ్రా దెబ్బకు కంగారూ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. ఈ సిరీస్‌లో బుమ్రా లీడింగ్‌ వికెట్‌టేకర్‌గా నిలిచి ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు సొంతం చేసుకున్నాడు. సిడ్నీ టెస్ట్ రెండోరోజు వెన్నునొప్పితో దూరమవడంతో భారత్ కు ఆ మ్యాచ్ లో ఓటమి ఎదురైంది.

Also Read: Trisha Gongadi: టీ20 ప్రపంచకప్‌లో తెలుగమ్మాయి రికార్డు.. 53 బంతుల్లోనే సెంచ‌రీ!

ఇదిలా ఉంటే 2018లో కోహ్లి తర్వాత ఐసీసీ టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు గెలుచుకున్న మొదటి భారత క్రికెటర్‌ బుమ్రానే. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఓడినా.. అతడికే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. ఇక ఈ సిరీస్ లో పలు అరుదైన రికార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిను కూడా బుమ్రా అధిగమించాడు. 20 కంటే తక్కువ బౌలింగ్ యావరేజ్‍తో 200 టెస్టు వికెట్ల మైలురాయిని సాధించిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తం మీద గత ఏడాది బుమ్రా అదిరిపోయే ప్రదర్శనకు ఐసీసీ అవార్డు దక్కడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Exit mobile version