Jake Paul vs Mike Tyson : 58 ఏళ్ల దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్‌ను 27 ఏళ్ల యూట్యూబర్ జేక్ పాల్ ఓడించాడు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆర్లింగ్టన్‌లో ఉన్న ఏటీఅండ్‌టీ స్టేడియం వేదికగా వీరిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఈ మ్యాచ్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ మ్యాచ్‌ను భారతీయులు కూడా పెద్దసంఖ్యలో వీక్షించారు. ఈసందర్భంగా అమెరికా, భారత్‌లో నెట్‌ఫిక్ల్స్ కాసేపు షట్ డౌన్ అయిందనే వార్తలు వచ్చాయి.
Also Read :X Vs Bluesky : లక్షలాది ‘ఎక్స్’ యూజర్లు జంప్.. ‘బ్లూ స్కై’కు క్యూ.. కారణమిదీ
మ్యాచ్‌లో భాగంగా మొత్తం 8 రౌండ్లలో మైక్ టైసన్ – జేక్ పాల్ తలపడ్డారు. వీటిలో ఆరు రౌండ్లలో పాల్ గెలిచాడు. మైక్ టైసన్ కేవలం రెండు రౌండ్లలోనే విజయం సాధించాడు. మొదటి రెండు రౌండ్లలో మాత్రమే టైసన్ గెలిచాడు. చివరి ఆరు రౌండ్లలో జేక్ పాల్ సత్తా చాటుకున్నాడు. చివరి ఆరు రౌండ్లకుగానూ ప్రతీ రౌండ్‌లోనూ 10 పాయింట్లను జేక్ పాల్ సాధించాడు. కేవలం 9 పాయింట్లతో టైసన్ సరిపెట్టుకున్నాడు. మొత్తం మీద 78 పాయింట్లను జేక్ పాల్ సాధించగా.. 74 పాయింట్లకు మైక్ టైసన్ పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్‌కు ముందే జేక్ పాల్‌ను మైక్ టైసన్ చెంపదెబ్బ కొట్టాడు. దీంతో భద్రతా సిబ్బంది ఇద్దరినీ అడ్డుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఇవాళ జేక్ పాల్ ప్రతీకారం తీర్చుకొని టైసన్‌పై విజయం సాధించాడు.
Also Read : Uttara Pradesh : బీజేపీ ఎంపీ విందులో మటన్ లొల్లి..
ఫ్రెండ్లీగా అభివాదం..
మ్యాచ్ ముగిసిన అనంతరం టైసన్, పాల్(Jake Paul vs Mike Tyson) మామూలుగానే అభివాదం చేసుకున్నారు. వాస్తవానికి టైసన్ సుదీర్ఘ గ్యాప్ తర్వాత బాక్సింగ్ చేశాడు. చివరిసారిగా 2005లో కెవిన్ చేతిలో టైసన్ ఓడిపోయాడు. ఆ తర్వాత ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు ఆయన గుడ్‌బై చెప్పారు. కట్ చేస్తే.. మళ్లీ ఇప్పుడు జేక్ పాల్‌తో టైసన్ తలపడ్డాడు. ఈ మ్యాచ్ వల్ల టైసన్‌కు రూ.168 కోట్లు, పాల్‌కు రూ.337 కోట్లు వచ్చాయని తెలిసింది.