ICC Test Ranking: టెస్టు ర్యాంకింగ్స్‌లో జైస్వాల్ దూకుడు..

తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. టెస్ట్ బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో జైస్వాల్ 12వ స్థానానికి చేరుకున్నాడు. 12వ ర్యాంక్ లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం దిగజారి 13వ స్థానానికి పడిపోయాడు.

ICC Test Ranking: తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. టెస్ట్ బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో జైస్వాల్ 12వ స్థానానికి చేరుకున్నాడు. 12వ ర్యాంక్ లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం దిగజారి 13వ స్థానానికి పడిపోయాడు. విరాట్ కోహ్లీ ర్యాంకింగ్స్ పై ప్రభావం చూపింది. కోహ్లీ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. రిషబ్ పంత్ 699 రేటింగ్ పాయింట్లతో 14వ స్థానంలో ఉన్నాడు. గిల్ 4 స్థానాలు ఎగబాకి 31వ ర్యాంకుకు చేరుకున్నాడు. అదేవిధంగా నాలుగో టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ధృవ్ జురేల్ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. ఏకంగా 31 స్థానాలు ఎగబాకి 69వ స్థానానికి చేరుకున్నాడు. 785 రేటింగ్ పాయింట్లతో జడేజా కూడా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.

సొంతగడ్డపై ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగుతుంది. తొలి టెస్టు హైదరాబాద్ లో జరిగింది. ఆరంభ మ్యాచ్ లో భారత్ ఇంగ్లాండ్ ఆధిపత్యం ప్రదర్శించి సిరీస్ లో తొలి టెస్ట్ నెగ్గింది.  ఆ తర్వాత విశాఖపట్నం వేదికగా రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. గిల్ సెంచరీతో కదం తొక్కగా మిగతా బ్యాటర్లు రాణించారు. ఈ మ్యాచ్ టీమిండియా గెలుపొందింది.

రాజ్ కోట్ వేదికగా యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీల మోత మోగించాడు. ఫలితంగా ఈ టెస్ట్ సునాయాసంగా విజయం సాదించింది. చివరిగా రాంచీ వేదికగా రోహిత్ సేన గెలిచి 3-1 తో ఆధిక్యం ప్రదర్శించింది. కాగా మార్చ్ 7న ధర్మశాల వేదికగా ఇరు జట్లు చివరి మ్యాచ్ లో తలపడతాయి. ఇప్పటికే మూడు మ్యాచ్ లు గెలిచిన టీమిండియా ధర్మశాల మ్యాచ్ నామమాత్రంగానే ఆడనుంది.

Also Read: Vinod: గురువు కోసమే బ్యారేజీ కొట్టుకుపోయేలా రేవంత్ కుట్రలు: వినోద్