Virat Kohli: కోహ్లీని స్లెడ్జింగ్ చేస్తే డేంజరే.. చుక్కలు చూపిస్తాడన్న ఆసీస్ మాజీ కెప్టెన్

మైదానంలో కోహ్లీ ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రత్యర్థులకు బ్యాట్ తోనే కాదు మాటతోనూ చుక్కలు చూపించేవాడు. ఈ విషయాన్ని ప్రత్యర్థి జట్ల కెప్టెన్లే అంగీకరించారు. తాజాగా విరాట్ కోహ్లీ గురించి ఆసీస్ మాజీ కెప్టెన్ టిమ్ పెయిన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు

Virat Kohli: ప్రపంచ క్రికెట్ లో స్లెడ్జింగ్ అనగానే గుర్తొచ్చే పేరు ఆస్ట్రేలియానే… ఎందుకంటే ఆటతో పాటు మాటలతోనూ ప్రత్యర్థిని దెబ్బ తీయడంలో కంగారూలకు మించిన వారు లేరు. చాలా సందర్భాల్లో ఇది వర్కౌట్ అయింది కూడా.. అయితే ఆసీస్ కు ధీటుగా బదులిచ్చిన జట్లలో మాత్రం టీమిండియానే ముందుంటుంది. అన్నింటికీ మించి స్లెడ్జింగ్ చేసే వారినే స్లెడ్జింగ్ చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీనే… మైదానంలో కోహ్లీ ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రత్యర్థులకు బ్యాట్ తోనే కాదు మాటతోనూ చుక్కలు చూపించేవాడు. ఈ విషయాన్ని ప్రత్యర్థి జట్ల కెప్టెన్లే అంగీకరించారు. తాజాగా విరాట్ కోహ్లీ గురించి ఆసీస్ మాజీ కెప్టెన్ టిమ్ పెయిన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

స్లెడ్జింగ్ చేసే మాకే చుక్కలు చూపించాడని గుర్తు చేసుకున్నాడు. అందుకే కోహ్లీని స్లెడ్జ్ చేయొద్దని చాలా మంది సలహా ఇచ్చేవారన్నాడు. తమ కోచ్ కూడా విరాట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పలుసార్లు హెచ్చరించిన సందర్భాలను కూడా ఈ ఆసీస్ మాజీ సారథి గుర్తు చేసుకున్నాడు. ప్రశాంతంగా బ్యాటింగ్ చేసే కోహ్లీని మాటలతో రెచ్చగొడితే మరింత విధ్వంసం సృష్టిస్తాడని తమకు తెలుసన్నాడు. అందుకే తనను స్లెడ్జ్ చేసినప్పుడు కూడా స్పందించేవాడిని కాదని టిమ్ పెయిన్ చెప్పుకొచ్చాడు. ఆరంభంలో కోహ్లీ గురించి తెలియక అతను బ్యాటింగ్ చేసేటప్పుడు ఏదో మాట అనేవాడినని గుర్తు చేసుకున్నాడు. అయితే కోహ్లీని స్లెడ్జ్ చేయొద్దంటూ తర్వాత కోచ్ చెప్పడంతో అసలు విషయం తెలిసిందన్నాడు.

2018-19 సీజన్ లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా కంగారూలకు భారత్ చుక్కలు చూపించింది. కోహ్లీ కెప్టెన్సీలో అక్కడికి వెళ్ళిన టీమిండియా తొలి టెస్ట్ గెలిచి రెండో మ్యాచ్ లో ఓడింది. మళ్ళీ మూడో టెస్టులో పుంజుకుని విజయం సాధించిన కోహ్లీసేన చివరి టెస్టును డ్రాగా ముగించింది. చివరి టెస్టులో ఆసీస్ ను ఫాలో ఆన్ ఆడించడం ద్వారా సొంతగడ్డపై వారికి గర్వభంగం చేసింది. ఈ సిరీస్ ను కైవసం చేసుకున్న తర్వాత ఆసీస్ పై భారత్ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. గత మూడు పర్యాయాలు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియానే సొంతం చేసుకుంది.

Also Read: Buffalo Raped: గేదెపై సామూహిక అత్యాచారం

Follow us