WI vs IND: రిటైరవ్వకుండానే కామెంటరీ చేసే తొలి క్రికెటర్‌.

WI vs IND: భారత్, వెస్టిండీస్ మధ్య జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇషాంత్ శర్మ సరికొత్త అవతారం ఎత్తబోతున్నాడు. బంతితో బ్యాట్స్ మెన్స్ ని ముప్పు తిప్పలు పెట్టే శర్మ ఈ సారి మైక్ చేతపట్టుకుని కామెంటరీతో అలరించనున్నాడు. ఇషాంత్ OTT ప్లాట్‌ఫారమ్ జియో సినిమా కోసం వ్యాఖ్యాతగా మారనున్నాడు. ఈ విషయాన్ని జియో సినిమా ట్విట్టర్ ద్వారా పంచుకుంది.

భారత జట్టు ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరమయ్యాడు.అతను తిరిగి జట్టులోకి వచ్చేందుకు తెరవెనుక శ్రమిస్తున్నాడు. అయితే జట్టులో అయితే స్థానం దక్కలేదు కానీ వ్యాఖ్యాతగా అరంగేట్రం చేయబోతున్నాడు ఇషాంత్. ఇషాంత్ శర్మ చివరిసారిగా IPL 2023లో ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇషాంత్ శర్మ 8 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు పడగొట్టాడు. దీని తర్వాత వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. నవంబర్ 2021లో కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అతను తన చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతను టీమ్ ఇండియాలో ఆడలేదు. కాగా.. రిటైరవ్వకుండానే కామెంటరీ చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు ఇషాంత్ శర్మ.

ఇషాంత్ భారత్ తరఫున 105 టెస్టు మ్యాచ్‌లు ఆడి 311 వికెట్లు తీశాడు. ఇక వన్డేల్లో భారత్ తరఫున 80 మ్యాచ్‌లు ఆడి 115 వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్‌ భారత్‌ తరఫున 14 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

Read More: Road Accident: యూపీలో స్కూల్ బస్సు-వ్యాన్ ఢీ: ఆరుగురు మృతి: Video