Site icon HashtagU Telugu

Bcci Central Contract: కిషన్, అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు ?

Bcci Central Contract

Bcci Central Contract

Bcci Central Contract: రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడనందుకు భారత జట్టు యువ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. బీసీసీఐ ఈ ఇద్దరు ఆటగాళ్లను తన సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.

ముంబైకి చెందిన శ్రేయాస్ అయ్యర్ గ్రేడ్ బి కాంట్రాక్ట్‌ను కలిగి ఉండగా, ఇషాన్ గ్రేడ్ సి కాంట్రాక్ట్‌ను కలిగి ఉన్నాడు. బీసీసీఐ త్వరలో సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. కాగా తాజాగా బీసీసీఐ సెక్రటరీ జే షా చేసిన ప్రకటనతో అయ్యర్, కిషన్ కష్టాల్లో పడ్డట్టేనని క్రికెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఒక్కరూ రంజీ ట్రోఫీలో ఆడటం తప్పనిసరి అని షా చెప్పాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్లు 2023-24 సీజన్ కోసం సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేయగా అది త్వరలో విడుదలవుతుంది.

దేశవాళీ క్రికెట్‌లో ఆడనందుకు ఇషాన్‌ కిషన్, శ్రేయాస్‌ను ఈ జాబితా నుంచి ఆల్మోస్ట్ తొలగించారని తెలుస్తుంది.ఇషాన్ కిషన్ చివరిసారిగా నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ తరఫున ఆడాడు. గతేడాది వ్యక్తిగత కారణాలతో దక్షిణాఫ్రికా టూర్ నుంచి వైదొలిగిన అతడు అప్పటి నుంచి జట్టుకు దూరమయ్యాడు.ఈ సమయంలో రంజీ ట్రోఫీలో తన సొంత జట్టు జార్ఖండ్ కోసం ఆడకుండా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో బరోడాలో ప్రాక్టీస్ చేస్తూ దొరికిపోయాడు. ఇది బీసీసీఐ కి తెలవడంతో కిషన్ ని తీవ్రంగా హెచ్చరించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

మరోవైపు ఇంగ్లాండ్‌తో జరిగిన మిగిలిన మూడు మ్యాచ్‌ల కోసం శ్రేయాస్‌ను జట్టు నుండి తొలగించారు. ఇటీవల, వెన్నునొప్పి కారణంగా రంజీ ట్రోఫీ క్వార్టర్-ఫైనల్‌లో ముంబై తరపున ఆడేందుకు శ్రేయాస్ నిరాకరించాడు. అయితే శ్రేయాస్‌కు ఎలాంటి గాయం లేదని పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని NCA తెలిపింది.దీంతో బీసీసీఐకి చిర్రెత్తుకొచ్చింది. తాజా సమాచారం మేరకు ఇషాన్ కిషన్, అయ్యర్లపై బీసీసీఐ కోలుకోలేని వేటు వేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. అది ఏంటనేది త్వరలోనే తెలుస్తుంది.

Also Read: Lok Sabha Polls 2024: మాయావతికి షాకిస్తూ బీజేపీలోకి జంప్ అయిన ఎంపీ