Ishan Kishan: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్ తన అద్భుతమైన ఫామ్‌తో భారీ జంప్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఇషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఆడిన మెరుపు ఇన్నింగ్స్ మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేసింది. దీనికి ప్రతిఫలంగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 17 స్థానాలు ఎగబాకి టాప్-10లోకి దూసుకెళ్లాడు.
టాప్-8లోకి ఇషాన్ కిషన్
తాజా ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ 8వ స్థానానికి చేరుకున్నాడు. గత వారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అతను 25వ స్థానంలో ఉండేవాడు. టీమ్ ఇండియాలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన వెంటనే అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. ప్రస్తుతం 732 రేటింగ్ పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు.
Also Read: ఏఎన్ఆర్ ప్రేమాభిషేకంకి 45 ఏళ్లు..స్పెషల్ వీడియో షేర్ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్
దీంతో టీ20 టాప్-10 బ్యాటర్ల జాబితాలో భారత్ నుండి నలుగురు ఆటగాళ్లు చోటు సంపాదించుకున్నారు. ఆ జాబితాలో వీరు ఉన్నారు.
- అభిషేక్ శర్మ
- తిలక్ వర్మ
- సూర్యకుమార్ యాదవ్
- ఇషాన్ కిషన్
ఇషాన్ కిషన్ అద్భుతమైన పునరాగమనం
దాదాపు 3 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇషాన్ కిషన్ టీమ్ ఇండియాలోకి ఘనంగా పునరాగమనం చేశాడు. జట్టులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 373 పరుగులు సాధించాడు. ఇందులో 1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఈ ప్రపంచకప్‌లో సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాల్సి ఉన్నప్పటికీ ఈశాన్ కిషన్ అసాధారణ ఫామ్‌ను చూసి మేనేజ్‌మెంట్ అతనికే ఓపెనింగ్ బాధ్యతలను అప్పగించింది. పాకిస్థాన్‌తో జరిగిన కీలక పోరులో అతను 77 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి తన ఎంపిక సరైనదేనని నిరూపించుకున్నాడు.
