Ishan Kishan: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు చారిత్రాత్మక విజయం సాధించడంలో స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించారు. అయితే ప్రస్తుతం ఆయన తన ఆట తీరు కంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తల్లో నిలిచారు. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 96 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించగా.. ఇషాన్ కిషన్ కేవలం 25 బంతుల్లోనే 54 పరుగులు చేసి అదరగొట్టారు. విజయం తర్వాత నరేంద్ర మోదీ స్టేడియంలో తన ప్రేయసి అదితి హుండియాను ఆలింగనం చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇషాన్ కిషన్ పెళ్లి గురించి తాతగారి వెల్లడి
దైనిక్ భాస్కర్ నివేదిక ప్రకారం.. ఇషాన్ కిషన్ తాత రామానుగ్రహ పాండే మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. “నేను ఇషాన్‌ని ‘నీ పెళ్లి చూసేంత వరకు నేను బ్రతికే ఉంటానా?’ అని అడిగాను. దానికి ఇషాన్ నవ్వుతూ ‘తాతయ్యా, వచ్చే ఏడాదే నా పెళ్లి జరుగుతుంది. నా బిడ్డ పుట్టే వరకు మీరు ఉండాలి, అప్పుడు మీరు మనవడిని మీ ఒడిలో ఆడుకోవాలి’ అని చెప్పాడు” అని తెలిపారు. ఇషాన్ ఎవరితో సంతోషంగా ఉంటాడో, వారినే తాము కూడా అంగీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Also Read: ఇండిగోకు భారీ షాక్.. సీఈవో పదవికి పీటర్ రాజీనామా!
ఎవరు ఈ అదితి హుండియా?
ఇషాన్ కిషన్ ప్రేయసి అదితి హుండియా గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. అదితి ‘మిస్ దివా 2018’ విజేత, ‘ఫెమినా మిస్ ఇండియా’ ఫైనలిస్ట్. జాతీయ స్థాయి అందాల పోటీల్లో కూడా ఆమె పాల్గొంది. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. 2019 ఐపీఎల్ సమయంలో అదితి గ్యాలరీలో కనిపించడంతో వీరిద్దరి మధ్య సంబంధం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఆమెను ‘మిస్టరీ ఫ్యాన్‌గర్ల్’ అని పిలుస్తారు. అదితి తండ్రి జైపూర్‌లో నెయ్యి వ్యాపారి. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఫైనల్ మ్యాచ్‌కు ముందు కూడా అదితి టీమ్ ఇండియాతో కలిసి డిన్నర్‌లో పాల్గొనడం విశేషం.
