Site icon HashtagU Telugu

Rohit Sharma : రోహిత్ రాజకీయాల్లోకి వస్తున్నారా ? సీఎంతో భేటీ అందుకేనా?

Cricketer Rohit Sharma Politics Maharashtra Cm Devendra Fadnavis

Rohit Sharma : స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా ? మహారాష్ట్ర బీజేపీలో చేరాలనే ఆసక్తితో ఆయన ఉన్నారా ?  ఈక్రమంలోనే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో భేటీ అయ్యారా ? అనే కోణంలో ప్రస్తుతం చర్చ నడుస్తోంది.  ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై ప్రకటించిన రోహిత్.. మంగళవారం రోజు మహారాష్ట్ర సీఎంతో సమావేశం అయ్యారు. ఈ మీటింగ్‌లో ఏయే అంశాలపై చర్చ జరిగింది ? అనే సమాచారం బయటికి రాలేదు. కానీ రోహిత్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారమైతే మొదలై పోయింది.

Also Read :Floating Houses : భూకంపం వస్తే గాల్లో తేలే ఇళ్లు.. టెక్నాలజీ రెడీ

మహారాష్ట్ర సీఎం ట్వీట్‌లో ఏముందంటే.. 

మంగళవారం రోజు తనను రోహిత్ శర్మ కలిసిన అనంతరం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్(Rohit Sharma)  ఒక ట్వీట్ చేశారు. ‘‘నా అధికారిక నివాసం వర్షలో భారత క్రికెటర్ రోహిత్ శర్మను కలిసినందుకు సంతోషంగా ఉంది. ఆయనతో మాట్లాడాను. టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్  రిటైర్మెంట్ గురించి మేం మాట్లాడుకున్నాం. రోహిత్ కెరీర్ ప్రయాణంలోని తదుపరి అధ్యాయంలోనూ విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. రోహిత్‌కు నా శుభాకాంక్షలు తెలియజేశాను’’ అని ఫడ్నవిస్ పేర్కొన్నారు. రోహిత్ తదుపరి కెరీర్ అధ్యాయం.. రాజకీయమే అయి ఉండొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Also Read :BSF Jawan Returned : బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను అప్పగించిన పాక్‌.. ఇలా దారికొచ్చింది!

రోహిత్ శర్మ.. పాలిటిక్స్ ఎక్కడి నుంచి ?