IPL 2023 Playoffs Schedule: నేటి నుంచి ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌.. పూర్తి షెడ్యూల్, ప్రత్యక్ష ప్రసార వివరాలివే..!

నేటి నుంచి ఐపీఎల్ 2023 ప్లేఆఫ్‌ (IPL 2023 Playoffs)లు ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి.

  • Written By:
  • Publish Date - May 23, 2023 / 08:45 AM IST

IPL 2023 Playoffs Schedule: నేటి నుంచి ఐపీఎల్ 2023 ప్లేఆఫ్‌ (IPL 2023 Playoffs)లు ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఐపీఎల్ 2023 లీగ్ దశ ముగిసిన తర్వాత గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో ఉంది. దీని తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ మూడో స్థానంలోనూ, ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంలోనూ కొనసాగాయి. ఇటువంటి పరిస్థితిలో మొదటి క్వాలిఫయర్ గుజరాత్, చెన్నై మధ్య ఎలిమినేటర్ లక్నో, ముంబై మధ్య జరుగుతుంది.

IPL 2023 మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ మే 23న చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య MA చిదంబరం స్టేడియంలో అంటే చెన్నై హోమ్ గ్రౌండ్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. అదే సమయంలో ఓడిన జట్టుకు మరోసారి ఫైనల్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. దీని తర్వాత మే 24న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మరోవైపు మొదటి క్వాలిఫయర్‌లో ఓడిన జట్టుతో ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడుతుంది.

Also Read: IPL 2023 Qualifier 1: ఫైనల్ చేరే తొలి జట్టు ఏదో ? ప్లే ఆఫ్ సమరానికి చెన్నై.గుజరాత్ రెడీ

దీని తర్వాత మే 26న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి క్వాలిఫయర్‌లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్‌ను ఆడనున్నాయి. మరోవైపు మే 28న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి క్వాలిఫయర్‌లో గెలిచిన జట్టు, రెండో క్వాలిఫయర్‌లో గెలిచిన జట్టు మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ప్లేఆఫ్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసార వివరాలు

భారతదేశంలో జరిగే ప్లేఆఫ్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ఉంటుంది. మరోవైపు మొబైల్‌లో మ్యాచ్‌ను వీక్షించే వీక్షకులు Jio Cinema యాప్, వెబ్‌సైట్‌లో మ్యాచ్‌ను చూడవచ్చు. ప్లేఆఫ్ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతాయి.