Site icon HashtagU Telugu

IPL Playoff Scenarios: ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఇలా జ‌ర‌గాలి.. లేకుంటే ఇంటికే..!

IPL Playoff Scenarios

IPL Playoff Scenarios

IPL Playoff Scenarios: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL Playoff Scenarios) ఈ సీజన్ చివరి దశకు చేరుకుంది. చాలా జట్లలో 13 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మాత్రమే రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్లేఆఫ్ కోణం నుండి ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అదే సమయంలో మే 18న బెంగళూరులో జరిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ కూడా నిర్ణయాత్మకంగా మారవచ్చు. రెండు జట్లూ ప్లే ఆఫ్ రేసులో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఏ జట్టు ఏ సమీకరణంతో అర్హత సాధించగలదో తెలుసుకుందాం.

CSKకి మూడు మార్గాలున్నాయి

ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. 13 మ్యాచుల్లో 7 గెలిచి పాయింట్ల పట్టికలో CSK మూడో స్థానంలో ఉంది. CSK 14 పాయింట్లు, నికర రన్ రేట్ +0.528. CSK ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే RCBతో జరిగే మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. లేదా ఈ మ్యాచ్ అసంపూర్తిగా మిగిలిపోతే దీంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ దక్కగా, సీఎస్‌కే 15 పాయింట్లతో అర్హత సాధిస్తోంది.

Also Read: Dietary Guideline: ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోక‌పోతే ప్ర‌మాద‌మే..!

దీనితో పాటు CSK రెండవ సమీకరణం ఏమిటంటే వారు 18 పరుగుల కంటే తక్కువ తేడాతో లేదా 11 బంతుల కంటే తక్కువ మిగిలి ఉండగానే ఓడిపోవాలి. అంతేకాకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్ తన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం CSKకి అనుకూలంగా ఉన్న మూడవ సమీకరణం. ఒకవేళ సన్‌రైజర్స్ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోతే RCBపై ఘోర పరాజయాన్ని చవిచూడనట్లయితే, CSK మంచి నెట్ రన్ రేట్ కలిగి ఉన్నందున అర్హత పొందవచ్చు.

RCB ఈ మార్గాలను కలిగి ఉంది

ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి మాట్లాడుకుందాం. RCB ప్రస్తుతం 13 మ్యాచ్‌లలో 6 గెలిచి ఆరో స్థానంలో ఉంది. ఆర్సీబీ 12 పాయింట్లతో నెట్ రన్ రేట్ +0.387. RCB ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే వారు 18 కంటే ఎక్కువ పరుగులతో లేదా 11 కంటే ఎక్కువ బంతులు మిగిలి ఉండగానే CSKని ఓడించాలి.

We’re now on WhatsApp : Click to Join

రెండవ సమీకరణం ఏమిటంటే.. ఆర్సీబీ.. CSKపై స్వల్ప తేడాతో గెలిచినా సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోవాలి. ఇది CSK, RCB రెండింటికీ ప్రయోజనం చేకూరుస్తుంది. వారు ప్లేఆఫ్‌లకు అర్హత పొందవచ్చు. అయితే సన్‌రైజర్స్ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం అంటే కష్టమే. హైద‌రాబాద్ జ‌ట్టు మిగిలిన రెండు మ్యాచ్‌లు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌తో ఉన్నాయి. ఈ మ్యాచ్‌ల త‌ర్వాత‌నే ప్లేఆఫ్‌లో మిగిలిన రెండు జట్లు ఎవరనేది తెలుస్తోంది. ప్ర‌స్తుతం కేకేఆర్‌, ఆర్ఆర్ ప్లేఆఫ్‌ల‌కు అర్హ‌త సాధించాయి.