IPL 2026 Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రకు ఇప్పుడు 19 ఏళ్లు నిండాయి. నమ్మశక్యంగా లేదు కదా.. ఆర్‌సీబీ (RCB) కూడా ఛాంపియన్‌గా నిలిచింది! అవును ఇది నిజం. ఐపీఎల్ 2026 క్రికెట్ అభిమానుల కోసం సరికొత్త ఉత్సాహాన్ని తీసుకురాబోతోంది. మార్చి 28 నుండి వచ్చే సీజన్ ప్రారంభం కానుంది. బీసీసీఐ ప్రస్తుతం మొదటి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసినందున ఫైనల్ తేదీ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఆ 20 మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయో ఇక్కడ చూడండి.
ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్ మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. ఆర్‌సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ కాబట్టి సీజన్ తొలి మ్యాచ్ వారి హోమ్ గ్రౌండ్ అయిన ఎం. చిన్నస్వామి స్టేడియంలోనే జరుగుతుంది.
Also Read: War Effect : దేశ ప్రజలను అలర్ట్ చేస్తున్న ప్రధాని మోదీ..ఏంజరగబోతుంది..?
IPL 2026 షెడ్యూల్
- మార్చి 28 – RCB vs SRH – బెంగళూరు
- మార్చి 29 – MI vs KKR – ముంబై
- మార్చి 30 – RR vs CSK – గువహటి
- మార్చి 31 – PBKS vs GT – న్యూ చండీగఢ్
- ఏప్రిల్ 1 – LSG vs DC – లక్నో
- ఏప్రిల్ 2 – KKR vs SRH – కోల్‌కతా
- ఏప్రిల్ 3 – CSK vs PBKS – చెన్నై
- ఏప్రిల్ 4 – DC vs MI – ఢిల్లీ
- ఏప్రిల్ 4 – GT vs RR – అహ్మదాబాద్
- ఏప్రిల్ 5 – SRH vs LSG – హైదరాబాద్
- ఏప్రిల్ 5 – RCB vs CSK – బెంగళూరు
- ఏప్రిల్ 6 – KKR vs PBKS – కోల్‌కతా
- ఏప్రిల్ 7 – RR vs MI – గువహటి
- ఏప్రిల్ 8 – DC vs GT – ఢిల్లీ
- ఏప్రిల్ 9 – KKR vs LSG – కోల్‌కతా
- ఏప్రిల్ 10 – RR vs RCB – గువహటి
- ఏప్రిల్ 11 – PBKS vs SRH – న్యూ చండీగఢ్
- ఏప్రిల్ 11 – CSK vs DC – చెన్నై
- ఏప్రిల్ 12 – LSG vs GT – లక్నో
- ఏప్రిల్ 12 – MI vs RCB – ముంబై
నివేదికల ప్రకారం.. మిగిలిన షెడ్యూల్‌ను ఈ వారంలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026లో ఇంకా 54 మ్యాచ్‌ల షెడ్యూల్ రావాల్సి ఉంది. ఫైనల్ మ్యాచ్ మే 31న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026 ఫార్మాట్ గతంలో లాగే ఉంటుంది. లీగ్ స్టేజ్‌లో ప్రతి జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. పాయింట్ల పట్టికలో మొదటి 4 స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.
