ఐపీఎల్ 2026.. కేకేఆర్‌లోకి స్టార్ బౌల‌ర్‌?

మొదటి మ్యాచ్‌లో కేకేఆర్ 20 ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోరు సాధించినా, ముంబై బ్యాటర్లు బలహీనమైన బౌలింగ్‌ను ఆసరాగా చేసుకుని 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించారు.

Published By: HashtagU Telugu Desk
Mathisha Pathirana

Mathisha Pathirana

Mathisha Pathirana: ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్‌లోనే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించి 200 పరుగుల మార్కును దాటించినప్పటికీ బౌలింగ్ వైఫల్యం కారణంగా జట్టుకు పరాజయం తప్పలేదు. ప్రస్తుతం కేకేఆర్ బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా కనిపిస్తోంది. ఇప్పటికే హర్షిత్ రాణా గాయంతో టోర్నీకి దూరం కాగా శ్రీలంక స్టార్ పేసర్ మతీషా పతిరాణ రాకపై సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా దీనిపై జట్టు అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ స్పందించారు.

ప్రస్తుతానికి వేచి చూస్తున్నాం – వాట్సన్

ఏప్రిల్ 2న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న తదుపరి మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పతిరాణ పునరాగమనం గురించి వాట్సన్ మాట్లాడారు. “శ్రీలంక క్రికెట్ బోర్డు నుండి సమాధానం కోసం మేము ఎదురుచూస్తున్నాం. అతను వీలైనంత త్వరగా జట్టుతో చేరేలా సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. పతిరాణ ఇక్కడే ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే కేకేఆర్‌లో మాకు అద్భుతమైన సపోర్ట్ స్టాఫ్, మెడికల్ టీమ్ ఉన్నారు. అయితే అతను పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకముందే మైదానంలోకి దించే రిస్క్ తీసుకోం” అని ఆయన స్పష్టం చేశారు.

Also Read: మిడిల్ ఈస్ట్ యుద్ధం.. ఇరాన్‌పై పెరుగుతున్న‌ ఒత్తిడి?!

కేకేఆర్ బౌలింగ్‌పై పెరుగుతున్న ఒత్తిడి

ఈ సీజన్ ప్రారంభానికి ముందే కేకేఆర్ జట్టు తమ ప్రధాన బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను విడుదల చేసింది. వేలంలో అతనిని రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేసినప్పటికీ జట్టు నుండి తప్పించారు. దీనికి తోడు హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ ఇద్దరూ గాయాల కారణంగా టోర్నమెంట్ నుండి తప్పుకోవడం జట్టును దెబ్బతీసింది. వీరి స్థానంలో నవదీప్ షైనీని రీప్లేస్‌మెంట్‌గా తీసుకున్నప్పటికీ మొదటి మ్యాచ్‌లో బౌలింగ్ లోపాలు స్పష్టంగా కనిపించాయి.

మొదటి మ్యాచ్‌లో కేకేఆర్ 20 ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోరు సాధించినా, ముంబై బ్యాటర్లు బలహీనమైన బౌలింగ్‌ను ఆసరాగా చేసుకుని 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించారు. పతిరాణ జట్టులోకి వస్తేనే కేకేఆర్ బౌలింగ్ గాడిలో పడే అవకాశం ఉంది.

  Last Updated: 31 Mar 2026, 06:04 PM IST