Suresh Raina: ఐపీఎల్ 2025 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కి అనుకున్న స్థాయిలో రాణించలేదు. అంతేకాకుండా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అప్పటి నుండి సీఎస్‌కే తదుపరి సీజన్ కోసం కొన్ని ప్రత్యేక సన్నాహాలు చేయవచ్చని, జట్టులో కొన్ని ముఖ్యమైన మార్పులు జరగవచ్చని ఊహాగానాలు ఊపందుకున్నాయి. జట్టు న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రచిన్ రవీంద్రను విడుదల చేయవచ్చని, అతనిపై ఢిల్లీ క్యాపిటల్స్ దృష్టి సారించిందని చర్చలు జరుగుతున్నాయి.
అదే విధంగా సీఎస్‌కే గోల్డెన్ పిరీయడ్‌లో ముఖ్య స్తంభంగా ఉన్న సురేష్ రైనా (Suresh Raina) మరోసారి బ్యాటింగ్ కోచ్‌గా జట్టుతో చేరవచ్చని చర్చలు జరుగుతున్నాయి. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. చెన్నై సూపర్ కింగ్స్ సంజు శాంసన్‌ను జట్టులో చేర్చుకోవడాన్ని పరిశీలిస్తోంది. శాంసన్ ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా కనిపించాడు. అయితే ఐపీఎల్ 2026లో అతను చెన్నై లేదా కోల్‌కతా జట్టులో చేరవచ్చనే కథనాలు తెగ వైరల్ అవుతున్నాయి. నివేదిక ప్రకారం.. సురేష్ రైనా తదుపరి ఐపీఎల్ సీజన్‌లో సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్‌గా జట్టులో చేరవచ్చని కూడా పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై రైనా ప్రస్తుతం మౌనంగా ఉన్నాడు.
Also Read: Railways : రైల్వేశాఖ కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా రైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు..
రచిన్ రవీంద్ర విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ అతనిపై దృష్టి సారించింది. అతను ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగంగా ఉన్నాడు. సీఎస్‌కే రచిన్ రవీంద్రను విడుదల చేసి డోనోవన్ ఫెరీరాను జట్టులో చేర్చుకోవాలని భావిస్తోందని సమాచారం. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త ఓపెనర్ అవసరం ఉంది. వారు ఫాఫ్ డు ప్లెసిస్‌ను విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సీఎస్‌కే రచిన్ రవీంద్రను విడుదల చేస్తే.. అతన్ని జట్టులో చేర్చుకోవాలని ఢిల్లీ భావిస్తోంది.
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన రచిన్ 8 మ్యాచ్‌లలో 27.29 సగటుతో 191 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను కేవలం ఒక మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించాడు. అందులో అతను 65 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.