ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

ఓ నివేదిక ప్రకారం.. ఐపీఎల్ 2026 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించనుంది. 2025 సీజన్‌లో అక్షర్ పటేల్ సారథ్యంలో ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది.

Published By: HashtagU Telugu Desk
KL Rahul

KL Rahul

KL Rahul: ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా జట్టు నాయకత్వ బాధ్యతలను మార్చాలని యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కెప్టెన్ మార్పుకు సిద్ధమైన ఢిల్లీ

ఓ నివేదిక ప్రకారం.. ఐపీఎల్ 2026 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించనుంది. 2025 సీజన్‌లో అక్షర్ పటేల్ సారథ్యంలో ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది. 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 6 ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్న కేఎల్ రాహుల్ అయితే జట్టును విజయపథంలో నడిపిస్తారని ఫ్రాంచైజీ నమ్ముతోంది.

Also Read: బాండీ బీచ్ దాడి.. వారికి ఆస్ట్రేలియా ప్రధాని క్షమాపణలు!

కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ రికార్డు

కేఎల్ రాహుల్ గతంలో ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించారు.

  • మొత్తం మ్యాచ్‌లు: 64
  • విజయాలు: 32
  • ఓటములు: 30
  • ఫలితం తేలనివి: 2

ఐపీఎల్ 2026 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి స్క్వాడ్

ఢిల్లీ ఫ్రాంచైజీ వేలంలో, రిటెన్షన్ ద్వారా ఒక బలమైన జట్టును ఎంపిక చేసుకుంది. ఆ జట్టు వివరాలు ఇలా ఉన్నాయి.

బ్యాటర్లు & వికెట్ కీపర్లు: కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, నితీష్ రాణా, బెన్ డక్కెట్, డేవిడ్ మిల్లర్, పథుమ్ నిస్సంక, పృథ్వీ షా, సాహిల్ పారఖ్.

ఆల్ రౌండర్లు: అక్షర్ పటేల్, ఆశుతోష్ శర్మ, అజయ్ మండల్, విప్రజ్ నిగమ్.

బౌలర్లు: మిచెల్ స్టార్క్, టి.నటరాజన్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీర, లుంగి ఎన్గిడి, కైల్ జేమీసన్, త్రిపురాణ విజయ్, మాధవ్ తివారీ, ఔకిబ్ డార్.

  Last Updated: 22 Dec 2025, 09:45 PM IST