IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఈసారి ఫైనల్‌ అక్కడే?

ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. ఉత్కంఠభరితంగా సాగే ఈ టోర్నీ ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం అధికారికంగా విడుదల చేసింది. ఈసారి గ్రాండ్ ఫైనల్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మే 31న తుదిపోరు జరగనుంది. 70 లీగ్ మ్యాచ్‌ల తర్వాత ప్రారంభమయ్యే ప్లేఆఫ్స్ పోరులో భాగంగా మే 26న ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. ఇందులో పాయింట్ల పట్టికలో […]

Published By: HashtagU Telugu Desk
BCCI Announces IPL 2026 Playoffs schedule

BCCI Announces IPL 2026 Playoffs schedule

ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. ఉత్కంఠభరితంగా సాగే ఈ టోర్నీ ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం అధికారికంగా విడుదల చేసింది. ఈసారి గ్రాండ్ ఫైనల్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మే 31న తుదిపోరు జరగనుంది.

70 లీగ్ మ్యాచ్‌ల తర్వాత ప్రారంభమయ్యే ప్లేఆఫ్స్ పోరులో భాగంగా మే 26న ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. ఇందులో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ బెర్త్ కోసం తలపడతాయి. అనంతరం మే 27న న్యూ చండీగఢ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో మూడు, నాలుగు స్థానాల్లోని జట్లు పోటీపడతాయి. క్వాలిఫయర్‌-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు మధ్య జరిగే క్వాలిఫయర్‌-2 మ్యాచ్ కూడా మే 29న ఇదే వేదికపై నిర్వహిస్తారు.

సాధారణంగా ఐపీఎల్ నిబంధనల ప్రకారం గత సీజన్ విజేత హోమ్ గ్రౌండ్‌లో ఫైనల్ జరుగుతుంది. ఈ లెక్కన గత ఎడిషన్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కావడంతో ఫైనల్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా బీసీసీఐ ఈ వేదికను అహ్మదాబాద్‌కు మార్చింది.

ఈ మార్పుపై బీసీసీఐ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. “వాస్తవానికి ఫైనల్ వేదికగా బెంగళూరును నిర్ణయించాం. అయితే, స్థానిక అసోసియేషన్, అధికారుల నుంచి వచ్చిన కొన్ని అభ్యర్థనలు, నిబంధనలు బీసీసీఐ నిర్దేశించిన మార్గదర్శకాలు, ప్రోటోకాల్స్‌కు అతీతంగా ఉన్నాయి. ఈ కారణంగానే వేదికను మార్చాల్సి వచ్చింది” అని బీసీసీఐ స్పష్టం చేసింది. అంతేగాక‌ “నిర్వహణ, లాజిస్టికల్ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్‌లో ప్రత్యేక పరిస్థితుల్లో ప్లేఆఫ్స్‌ను మూడు వేదికల్లో నిర్వహిస్తున్నాం” అని కూడా తెలిపింది.

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ వివరాలు:
క్వాలిఫయర్ 1: మే 26 – హెచ్‌పీసీఏ స్టేడియం, ధర్మశాల
ఎలిమినేటర్: మే 27 – న్యూ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, న్యూ చండీగఢ్
క్వాలిఫయర్ 2: మే 29 – న్యూ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, న్యూ చండీగఢ్
ఫైనల్: మే 31 – నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్

  Last Updated: 06 May 2026, 01:58 PM IST