- నేడు ఐపీఎల్ మినీ వేలం
- అబుదాబిలోని ఎతిహాద్ స్టేడియంలో ఐపీఎల్ వేలం
- ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేసిన బీసీసీఐ
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తదుపరి సీజన్ మార్చి 26 నుండి మే 31 మధ్య జరుగుతుంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన సొంత మైదానమైన బెంగళూరులో టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వగలదా లేదా అనేది చూడాల్సి ఉంది. నియమాల ప్రకారం.. ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన ఆర్‌సీబీకి తమ హోమ్ గ్రౌండ్ అయిన ఎమ్ చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ నిర్వహించే అవకాశం రావాలి. కానీ ఈ ఏడాది జూన్‌లో ఆర్‌సీబీ విజయోత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కొన్ని షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. స్టేడియం తప్పనిసరిగా అవసరమైన భద్రతా ప్రమాణాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఐపీఎల్ 2026 మినీ వేలం విశేషాలు
ఐపీఎల్ 2026 కోసం చిన్నపాటి వేలం ఈరోజు అబుదాబిలో జరగనుంది. మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యధిక పర్స్ మనీతో వేలంలోకి దిగుతోంది.
వేలం ఎప్పుడు జరుగుతుంది?
ఐపీఎల్ 2026 మినీ వేలం ఈరోజు, డిసెంబర్ 16, మంగళవారం అంటే నేడు జరుగుతుంది.
వేలం ఏ సమయంలో ప్రారంభమవుతుంది?
ఈ వేలం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.
Also Read: నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్ గాంధీలకు ఊరట!
వేలం ఎక్కడ జరుగుతుంది?
ఐపీఎల్ 2026 మినీ వేలం అబుదాబిలోని ఎతిహాద్ స్టేడియంలో జరుగుతుంది.
ఎంతమంది ఆటగాళ్లను కొనుగోలు చేస్తారు?
ఈ మినీ వేలంలో మొత్తం 10 జట్లు కలిసి 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి పోటీ పడతాయి.
మొత్తం బడ్జెట్
అన్ని జట్ల వద్ద కలిపి మొత్తం రూ. 237 కోట్ల 55 లక్షల నిధులు అందుబాటులో ఉన్నాయి.
ఈ వేలంలో ముంబై ఇండియన్స్ పాత్ర తక్కువగా ఉండనుంది. ఎందుకంటే వారి వద్ద కేవలం రూ. 2 కోట్ల 75 లక్షలు మాత్రమే ఉన్నాయి. వారు కొంతమంది అన్‌క్యాప్డ్ ఆటగాళ్లను వారి బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
