Site icon HashtagU Telugu

IPL 2025 Final: ఐపీఎల్ 2025.. ఫైన‌ల్ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఇదే!

IPL Tickets

IPL Tickets

IPL 2025 Final: ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ (IPL 2025 Final) నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు (IST) ప్రారంభమవుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) రెండు జట్లు తమ మొదటి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడానికి తలపడనున్నాయి. దీంతో 18 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో ఎనిమిదో ఛాంపియన్ జట్టు ఖాయమవుతుంది.

పిచ్ రిపోర్ట్

నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ బ్యాట్స్‌మన్‌లకు సహాయకరంగా ఉంటుంది. క్వాలిఫయర్-2 మ్యాచ్ ఈ మైదానంలో జరిగింది. ఇందులో మొత్తం 410 పరుగులు వ‌చ్చాయి. ఇది హై-స్కోరింగ్ గేమ్‌ను సూచిస్తుంది. ఈ సీజన్‌లో ఈ మైదానంలో ఆడిన 8 మ్యాచ్‌లలో 6 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. ఈ మైదానంలో అత్యధిక స్కోరు సాధించిన జట్టు పంజాబ్ కింగ్స్.. ఈ సంవత్సరం గుజరాత్ టైటాన్స్‌పై 243 పరుగులు చేసింది.

Also Read: CM Chandrababu : కొల్లేరు పరిరక్షణ అత్యవసరం.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

హెడ్-టు-హెడ్ రికార్డ్

పంజాబ్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఐపీఎల్‌లో 36 మ్యాచ్‌లు జ‌రిగాయి. ఇందులో రెండు జట్లు 18-18 విజయాలు సాధించాయి. ఐపీఎల్ 2025లో ఙ‌రు జ‌ట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరిగాయి, అందులో రెండు సార్లు బెంగళూరు జట్టు విజయం సాధించింది. గత 6 మ్యాచ్‌లను పరిశీలిస్తే.. పంజాబ్ కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. ఈ గణాంకాల ఆధారంగా RCB మొదటిసారి ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ఉంది.

RCB జ‌ట్టు (అంచ‌నా)

విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజెల్‌వుడ్, సుయష్ శర్మ.

పంజాబ్ కింగ్స్ జ‌ట్టు (అంచ‌నా)

ప్రియాంశ్ ఆర్య, జోష్ ఇంగ్లిస్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహల్ వఢేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయకుమార్ విశాక్, అర్షదీప్ సింగ్, యుజవేంద్ర చాహల్.